నారా లోకేశ్.. ప్రస్తుతం ఏపీలో అత్యంత దురదృష్టమైన రాజకీయ జాతకం ఎవరిది అని అంటే ముందుగా గుర్తొచ్చే పేరు. ఓవైపు తనపై తండ్రి చంద్రబాబుకు కొండంత ఆశలు.. మరోవైపు నాలుగు దశాబ్దాల పార్టీ పగ్గాలు అప్పనంగా అందివచ్చిన అవకాశం. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా అందిపుచ్చుకోలేని వైఫల్యం.. ఇవీ ఇప్పుడు నారా లోకేశ్ కు గుదిబండగా మారిన అంశాలు.

 

 

రాజకీయ వారసత్వం వరంగా లభించినా.. దాన్ని నిలబెట్టుకోవడంలో నారా లోకేశ్ ఘోరంగా విఫలమయ్యారు. చివరకు ఎమ్మెల్యేగా సైతం ఓడిపోయి తన రాజకీయ జీవితానికి దాదాపు సమాధి కట్టేసుకున్నంత పని చేశాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు నారా లోకేశ్ మరో ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. టీడీపీ పగ్గాలను నారా లోకేశ్ కు కాకుండా ఆయన భార్య నారా బ్రహ్మణి చేతికి అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చంద్రబాబులో మొదలైందని పుకార్లు వస్తున్నాయి.

 

 

అందుకు తాజా ఉదాహరణగా టీడీపీ యువ నాయకత్వ భేటీని ప్రస్తావిస్తున్నారు. ఈ భేటీ ఆసాంతం నారా బ్రహ్మణి ఆధ్వర్యంలోనే జరిగిందట. అదే నిజమైతే.. టీడీపీ పగ్గాలు నారా బ్రహ్మణి చేతికి వస్తే లోకేశ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది. మరి ఇదే నిజమైతే నారా లోకేశ్ ఫ్యూచర్ మరింత దారుణంగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

ఇప్పటికే నారా లోకేశ్ ను పప్పు ముద్ద అంటూ ముద్దు పేర్లు పెట్టి ప్రత్యర్థులు ఆడుకుంటూ ఉంటారు. దీనికి తోడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం.. మళ్లీ ఇప్పుడు పుండు మీద కారం జల్లినట్టు తనను కాదని తన భార్యకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఇక నారా లోకేశ్ ను ఎవరైనా పట్టించుకుంటారా.. ఇప్పటికే అధినేత కొడుకు కాబట్టి, ఎంతైనా పార్టీకి కాబోయే నాయకుడు అన్న కోణంగా కాస్త గౌరవం ఇస్తున్నారు. మనసులో ఎలా ఉన్నా పైకి మాత్రం ఆహా ఓహో అంటున్నారు. రేపు బ్రహ్మణి చేతికి పగ్గాలు వస్తే.. ఇక నారా లోకేశ్ భవితవ్యం ఊహించుకుంటేనే జాలిగొలిపేలా ఉందని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: