ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ (కోవిద్ 19 ) క్రమేపి భారత్ కు విస్తరిస్తోందా? అంటే ఇప్పుడు అవుననే సమాధానమే విన్పిస్తోంది . ఈ వ్యాధి సోకి చైనాలో వేలాది మంది మృత్యువాత పడిన నేపధ్యం లో కరోనా పాజిటివ్ లక్షణాలున్న రోగుల సంఖ్య భారత్ లోను పెరుగుతుండడం స్థానికులను ఆందోళన గురి చేస్తోంది . అయితే కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అటు కేంద్రం , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి . కోవిద్ 19 పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి .

 

తాము ఎంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెబుతున్నా...   కరోనా వైరస్ భూతం అంటేనే దేశవాసులు హడలిపోతున్నారు .   ఇప్పటికే ఢిల్లీ , హైదరాబాద్ లో ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు కన్పించగా , తాజాగా జైపూర్ లోను మరొక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కన్పించినట్లు రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి రఘు శర్మ జాతీయ మీడియా కు వెల్లడించారు . దీనితో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ఆరుకు చేరినట్లయింది . ఇప్పటికే కేరళలో ముగ్గురు  ఈ వైరస్ బారిన పడిన విషయం తెల్సిందే .  

 

గత నెల 29 వ తేదీన ఇటలీ నుంచి జైపూర్ కు వచ్చిన ఒక వ్యక్తిని పరీక్షించగా తొలుత జరిపిన పరీక్షల్లో  కరోనా లక్షణాలు లేనట్లు ఫలితం వెల్లడి కాగా , రెండవసారి జరిపిన పరీక్షల్లో మాత్రం పాజిటివ్ వచ్చినట్లు రఘుశర్మ తెలిపారు . రెండు వేర్వేరు ఫలితాలు రావడం తో అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి , పూణే కు అతని రక్త నమూనాలు పంపినట్లు వెల్లడించారు . భారత్ కు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల్లోనే కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తుండడం తో , విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను చూసి స్థానికులు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి .   

మరింత సమాచారం తెలుసుకోండి: