వైయస్ జగన్ పరిపాలన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతి చిన్న వయసులోనే అనేక రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొని ముఖ్యమంత్రిగా గెలిచి విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని అద్భుతంగా చేస్తున్నాడని జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులు. చాలా సర్వేలలో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో కొద్దినెలల పరిపాలనలోనే దేశంలో మంచి ముఖ్యమంత్రిగా మూడవ స్థానం దక్కించుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. పరిపాలన పరంగా మరియు అదే విధంగా ప్రజల పరంగా పార్టీకి మంచి పాజిటివ్ వేవ్ రాష్ట్రంలో ఉంది. అన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్న జగన్ కేవలం పార్టీలో ఉన్న కొంతమంది..., వాళ్లు వ్యవహరిస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వేషాలకు పార్టీకి చేటు కలుగుతుందేమో అన్న ఆందోళనలో ఇటీవల ఉన్నారట.

 

విషయంలోకి వెళితే గుంటూరు జిల్లా రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా గెలిచిన నాయకులు ఆ జిల్లాలో వైసీపీ పార్టీ జండా ని ముందు నుండి మోసిన సీనియర్ నాయకుల పై ఇష్టానుసారంగా వ్యవహరించడం ఈ విషయం మొత్తం జగన్ దృష్టికి వెళ్ళటం జరిగిందట. 17 నియోజకవర్గాలు కలిగిన గుంటూరు జిల్లాలో దాదాపు సగానికి పైగానే వైసిపి పార్టీ గెలవడం జరిగింది.  వీటిలో చిల‌క‌లూరిపేట‌, తాడికొండ‌, పొన్నూరు, గుర‌జాల‌, తెనాలి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన వారు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

 

అయితే, వీరిలో పొన్నూరు, తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల వారు సైలెంట్‌గా త‌మ ప‌ని తాము చేసుకుని పోతుండగా.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచిన వారు గ్రూపులు క‌ట్టి.. సీనియ‌ర్లను వేధిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.ముఖ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని అదేవిధంగా గురజాల ఎమ్మెల్యే mahesh REDDY' target='_blank' title='కాసు మహేష్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాసు మహేష్ రెడ్డి తమ నియోజకవర్గాలలో ఉన్న సీనియర్ నాయకుల పై భయంకరంగా పెత్తనం చెల్లించడం తో ఆ నియోజకవర్గాలలో వైసీపీ పార్టీలో గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి అని సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పైగా రాజధాని ఎఫెక్ట్ జిల్లాలో ఎక్కువగా ఉండటం తో ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా రాజధాని ప్రాంత జిల్లాలో సీనియర్లు - జూనియర్లు గొడవ జగన్ కి గట్టిగా చేటు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: