ఇటీవల దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కి తీవ్ర వ్యతిరేకత ఫలితాలు రావడం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైంది. దీంతో బీజేపీ పార్టీ పెద్దలు కళ్ళు తెరుచుకున్నాయి ఏమో తెలియదు కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఓడిపోయిన తర్వాత దక్షిణాదిలో బలమైన రాజకీయ నేతగా ఎదుగుతున్న వైయస్ జగన్ తో మోడీ సమావేశం అవ్వడం జరిగింది. దాదాపు వీరిద్దరూ గంటకు పైగా సమావేశం కావడంతో మోడీ - జగన్ భేటీ జాతీయస్థాయిలో హైలెట్ వార్తగా అప్పట్లో నిలిచింది.

 

కాగా ఢిల్లీ పర్యటన చేపట్టిన తర్వాత వైయస్ జగన్ తన పరిపాలన విషయంలో ప్రస్తుతం ఉస్సేన్ బోల్ట్ కంటే ఫాస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది. ఒక పక్క కేంద్ర మంత్రులతో భేటీ మరో పక్క రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి తెగ చక్కెర్లు కొడుతున్నారు జగన్. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తూ వాటిని ఆయా జిల్లాల మంత్రులకు జగన్ అప్ప చెప్పడం జరిగింది.

 

మార్చి చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఆయా జిల్లాలలో గెలవాలని ఎన్నికలను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. దీంతో ఒకపక్క రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు మరోపక్క ఎన్నికల పనులను జగన్ సర్కార్ వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమాత్రం తేడా జరిగినా మంత్రి పదవులు పోయే అవకాశం ఉందని జగన్ చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని వైసీపీ పార్టీలో టాక్. కాగా స్థానిక ఎన్నికల మేనేజ్ మెంట్ నుంచి ప్రచారం వరకూ అంతా జిల్లా ఇన్ ఛార్జి మంత్రులదేనని జగన్ తేల్చి చెప్పేశారట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: