తెలంగాణ కాంగ్రెస్ ఆశా కిరణం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటే సీఎం అయ్యే అవకాశాలు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన గోపనపల్లి లో కొనుగోలు చేసినట్టుగా చెబుతున్న భూముల వ్యవహారానికి సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం రేవంత్ పట్నం గోస యాత్ర తో హడావుడి చేస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహారాలకు సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా .. అక్రమాల గురించి ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలను తెలంగాణ ప్రభుత్వం సంపాదిస్తోంది. 

IHG


ఈ మేరకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనేక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశమే లేకుండా పూర్తిగా సాక్ష్యాధారాలు లభించినట్లు సమాచారం. గత మూడు, నాలుగు రోజులుగా ఆర్డీవో చంద్రకళ రేవంత్ రెడ్డి భూకబ్జాలు కు సంబంధించి అనేక ఆధారాలు బయటకు తీసినట్లు టాక్ నడుస్తోంది. అలాగే 1955 లో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తూ ఈ విచారణను వేగవంతం చేస్తున్నారు.

IHG


 రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.  గోపనపల్లి చుట్టుపక్కల అనేక అక్రమాలకు రేవంత్ పాల్పడినట్లు తేలిందట. అలాగే చెరువులోకి నీళ్ళు రాకుండా చేశారని ఇప్పటికే స్థానికులు ఫిర్యాదు చేశారు. భూకబ్జా, రెవెన్యూ చట్టాలు రేవంత్ ఉల్లంఘించినట్లు గా పోలీసులు సాక్షాధారాలు సంపాదించారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసులు కూడా బుక్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఈ వ్యవహారంలో రేవంత్ ధైర్యంగానే ఉన్నా .. తనకు మద్దతుగా పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడకపోవడం రేవంత్ కు బాధ కలిగిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: