అమాయకులకు వెసులుబాటు కోసం మరియు తొందరపాటు పనులు చేసిన వారికి ఇంకొక అవకాశం ఇచ్చేందుకు రూపొందించిన చట్టాలతో నిర్భయ నిందితులు కబడ్డీ ఆడేస్తున్నారు. జనవరి 22 ఫిబ్రవరి 1 - మార్చి3....నెక్స్ట్ తేదీనో? సినీ థ్రిల్లర్ ను మరపిస్తూ....కొనసాగుతోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలే ఇవన్నీ. తాజాగా మరోసారి తమ ఉరిశిక్షను వాయిదా వేయించు కోవడంలో సఫలమయ్యారు. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష మరో సారి వాయిదా పడింది. అన్ని దారులు మూసుకుపోయి ఇక దాదాపు ఉరి ఖాయమనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఉరి శిక్ష మరలా వాయిదా పడింది

 

IHG

 

గతంలో ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గుప్తా కోరాడు. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని ఉరితీయరాదని తీహార్ జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిందిఇలా స్టే ఇవ్వడం ఇది మూడోసారి.

 

ఇకపోతే నిందితులు నలుగురూ చాలా తెలివిగా ఒక మాట మీద వెళ్తూ తమ జీవిత కాలాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అంతా ఒకేసారి క్షమా భిక్ష, క్యూరేటివ్ పిటిషన్‌ లు వేయకుండా ఒకరి తర్వాత ఒకరు ఫైల్ చేస్తుండడంతో వారి జీవిత గడువు పెరుగుతోంది. దోషులు తమకు ఉన్న న్యాయ అవకాశాలను ఒకరి తర్వాత ఒకరు వినియోగించుకోవడంతో ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోంది.

 

IHG

 

ఇకపోతే నిర్భయ తల్లి….అందరూ దోషుల హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని.. తమకు మాత్రం హక్కులు ఉండవా అని ఆమె ప్రశ్నించారు. ఆమె వేసిన ప్రశ్నకు న్యాయమూర్తి స్పందించారు. ఆమె ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పిన న్యాయమూర్తి... ఆమెపై తనకు సానుభూతి ఉందని చెప్పారు.

 

ఇలా అంతా ఒక పక్క తనపై మరియు ఆమె కూతురిపై సానుభూతి చూపిస్తుంటే రాక్షసులు నెలలు తరబడి ఉరి తప్పించుకుంటుంటే…. నిర్భయ తల్లి బ్రతికి ఉండి అనుభవిస్తున్న నరకవేదన ఆమె కూతురి కన్నా ఎక్కువ అని పలువురు అంటున్నారు. వారికి తగిన శిక్ష అమలు ఆయ్యే దాకా ఆమెకు మనశ్శాంతి…. ఆమె కూతురికి ఆత్మశాంతి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: