ఓపిక, సహనం, ముందుచూపు, సమయస్ఫూర్తి, వ్యూహం, ప్రతివ్యూహం, ఇలా అన్నీ ఉంటేనే రాజకీయాల్లో సక్సెస్ అనేది సొంతమవుతుంది. కేవలం ఒక్క గ్లామర్ ను మాత్రమే ఆధారంగా చేసుకుని రాజకీయాల్లో రాణించాలంటే అది కష్టం. అంతేకాకుండా అకస్మాత్తుగా అధికారం దక్కాలంటే అది కుదరని పని. ఇప్పుడు అటువంటి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అశేషమైన అభిమానులు పవన్ కు ఉండడంతో రాజకీయాల్లో సులభంగా రాణించవచ్చని భావించినా  వాస్తవంలో మాత్రం దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో పార్టీ  ఓటమి చెందడంతో పవన్ పూర్తిగా నిరాశా నిస్పృహల్లో కి వెళ్లిపోయారు.

IHG


 భవిష్యత్తు అంధకారంగా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెనకా ముందూ చూడకుండా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి పవన్ పూర్తిగా స్వాతంత్రం కోల్పోయారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, ఏ ప్రకటన చేయాలన్నా, ముందుగా బిజెపి అనుమతి తీసుకోవాల్సి రావడం, సొంతంగా ఏ కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఉండటంతో పవన్ రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించినట్లు గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. పవన్ కు ఏపీలో సామాజికవర్గ బలం ,అభిమానుల అండదండలు పూర్తిగా ఉన్నా, పార్టీని సరైన రీతిలో నడపలేక పోతున్నారు. 

IHG


గతేడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కనీసం 20 - 30 స్థానాలు వస్తాయని భావించారు. అప్పుడు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు తానే కీలకం అవుతానని భావించారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. 2024 ఎన్నికల వరకు పార్టీని ముందుకు నడిపించాలంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లారు పవన్. కానీ అక్కడ పొత్తు పెట్టుకున్నామన్న సంతోషం పవన్ తో పాటు, ఆ పార్టీ నాయకులు ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. టిడిపితో పొత్తు పెట్టుకున్నా, జనసేన పరిస్థితి ఇంత కంటే మెరుగ్గా ఉండేది అనే భావన ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అందరిలోనూ ఉంది. రాజకీయంగా పవన్ వేసిన తప్పటడుగులు ఇప్పుడు జనసేనకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పుడు ముందుకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితిని తీసుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: