బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయినదానికీ కాని దానికి కూడా జగన్ కు ముడేసేసి మీడియాలో రెచ్చిపోతున్నాడు. దాంతో అసలు కన్నా సమస్యేంటి అనే విషయంలో పార్టీలో కాస్త ఆరాతీస్తే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. ఇందులో ప్రధానంగా రెండు అంశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మొదటిది అధ్యక్షస్ధానం నుండి కన్నాను తప్పించాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయిపోయింది. ప్రత్యామ్నాయం ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టే కన్నా కంటిన్యు అవుతున్నాడు. మామూలుగా అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్ళుంటుంది. కానీ కన్నాను మాత్రం ఏడాకి కూడా కాకుండానే ఎందుకు తప్పించేస్తున్నారు ? ఎందుకంటే పనితీరు ఏమాత్రం బాగాలేదని ఢిల్లీ పెద్దలకు చాలా కాలంగా ఫీడ్ బ్యాక్ వెళుతోందట.

 

అదే సమయంలో టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి అడుగులకు మడుగులొత్తుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్ ను టార్గెట్ చేయటమే ఏకైక లక్ష్యంగా సుజనా మాట్లాడుతుంటే కన్నా కూడా ఇదే ఫాలో అయిపోతున్నాడట. కాబట్టి  కన్నాపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.  ఈ విషయం తెలిసే రోజు జగన్ పై విరుచుకుపడుతున్నాడు.

 

ఇక రెండో ప్రధాన సమస్య ఏమిటంటే కన్నాను జగన్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు ప్రభుత్వం బాగా ఇంపార్టెన్స్ ఇస్తుందని కన్నా అనుకున్నాడట. కానీ జగనేమో  అసలు కన్నాను ఏమాత్రం లెక్క చేయటం లేదు.  దాంతో ప్రిస్టేజ్ గా ఫీలైన కన్నా, జగన్ పై రెచ్చిపోతున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. అంటే కారణం ఏదైనా కానీండి కన్నాను పదవిలో నుండి తప్పించటం మాత్రం ఖాయమని అర్ధమైపోతోంది. ఈలోగా జగన్ పై రెచ్చిపోవాలని చూస్తున్నట్లే అనిపిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: