ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తల్లి పాత్రలకు ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది. ఎందుకంటే హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో... తల్లి పాత్రలకు అందం అభినయం కూడా అంతే ముఖ్యం అని అనుకుంటున్నారు నేటి రోజుల్లో దర్శక నిర్మాతలు. దీంతో ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ... హీరో గ్లామర్ కు సరిపడే లా ఉండే వాళ్ళని మాత్రమే హీరోలకు తల్లిగా సెలెక్ట్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరోల తల్లి పాత్రలకు ఉన్నారు అనే చెప్పాలి. అయితే ఇలా హీరోల తల్లి పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎక్కువ సినిమాల్లో నటించిన వారిలో ముందుగా గుర్తొచ్చే పేరు ప్రగతి. ప్రగతి వయసు తక్కువే అయినప్పటికీ హీరోల తల్లి పాత్రలు చేయడం తో ప్రగతి ఆంటీ అందరూ అని  అంటుంటారు. 

 

 

 అయితే ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తల్లి పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ప్రగతి. కేవలం హీరోలకు తల్లిపాత్ర లోనే కాకుండా అత్త పాత్రలో కూడా సినిమాల్లో నటించటమే కాదు.. పలు  సినిమాల్లో  కీలక పాత్రల్లో  క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నది  ప్రగతి ఆంటీ. అయితే ప్రగతి ఆంటీ సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన ఓ వ్యక్తి.. ఎప్పుడూ తనతో బాగా మాట్లాడుతుండేవారని  కానీ ఓ రోజు ఆయన ప్రవర్తన లో కాస్త తేడా కనిపించింది అని కానీ ఆయన అలా చేసాడు  అని తాను ఊహించలేదు అంటూ తెలిపింది  ప్రగతి. 

 

 

 అయితే ఈ విషయంపై... తనకు కాసేపు వరకు ఏమీ అర్థం కాలేదని మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అంటూ ప్రగతి చెప్పుకొచ్చింది. ఇక తనతో విచిత్రంగా ప్రవర్తించిన కమెడియన్ షూట్  పూర్తయి ఇంటికి వెళ్తున్న సమయంలో  ఆ వ్యక్తిని క్యారీవ్యాన్ లో కి పిలిచాను అంటూ ప్రగతి తెలిపింది. ఆ తర్వాత తన చూపులు కానీ మాటలు కానీ చేతలు కానీ ఎక్కడైనా కాస్త మీకు డిఫరెంట్ గా అనిపించాయ అంటూ ఆ వ్యక్తిని డైరెక్ట్ గా అడిగాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి లేదు అని సమాధానం చెప్పగానే మరి మీరు ఎందుకు అలా ప్రవర్తించారు అంటూ అడిగిందట. దీంతో ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయ్ అని ఆ స్టార్ కమెడియన్ చెప్పాడట ఈ విషయాన్ని మీడియా వేదికగా చెప్పుకొచ్చిన ప్రగతి..  పేరు మాత్రం రివీల్  చేయలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: