రాజ‌కీయాల్లో వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు కామ‌నే! వీటిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధిం చాల‌ని కోరుకోవ‌డాన్ని కూడా ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే, ఈ వ్యూహప్ర‌తివ్యూహాల్లో ఎలాంటి ఫార్ములాలు వినియోగిస్తున్నార‌నేది మాత్రం.. చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాల‌ని అంటారు పెద్ద‌లు. అదేవిధంగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు రాజ‌కీయాల‌నే హేతువుగా చేసుకునిప్ర‌త్య‌ర్థుల‌పై పోరాటాలు చేయాల‌నేది కూడా ప్ర‌చారంలో ఉంది. అయితే, ఏపీలో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షంగా ఉన్న చంద్ర‌బాబు మాత్రం అందిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటాన‌ని చెబుతున్నారు.



ఇది కూడా మంచిదే.. ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌భుత్వంపై స‌మ‌ర‌స‌న్నాహం చేయాల్సి వ‌చ్చిన ప్పుడు అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ వినియోగించుకోవాల్సిందే. అయితే, ఈ క్ర‌మంలో పోలీసుల‌ను ప్ర‌ధానంగా చేసుకుని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. దారిత‌ప్పితే.. పోలీసుల‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. కానీ, వ్యూహాత్మ‌కంగా పోలీసుల‌ను ఇరికిం చే ప్ర‌య‌త్నాలు చేయ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ కు దారితీస్తోంది.



పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, వారిని బెదిరించ‌డం, తాము అధికారంలోకి వ‌స్తే.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, రిటైర్ అయిపోయినా.. వెతికి వెతికి ప‌ట్టుకుని చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖ‌చ్చిత‌మ‌ని హెచ్చ‌రించ‌డం వంటివి చంద్ర‌బాబు స్థాయికి త‌గునా అనే చ‌ర్చ సాగుతోంది. అదే స‌మ‌యంలో తాజాగా పోలీసుల మ‌ధ్య చిచ్చు పెట్టేలాగా చంద్ర‌బాబు వైఖ‌రి ఉండ‌డంపై ఒకింత అసహనం వ్య‌క్త‌మ‌వుతోంది. పోలీసు అధికారుల సంఘాన్ని ల‌క్ష్యంగా చేసుకుని టీడీపీ నేత‌లు తాజాగా కొన్ని విమ‌ర్శ‌లు చేశారు. అస‌లు ఈ సంఘం జ‌గ‌న్‌ను, ఆయ‌న ప‌రివారాన్ని కాపాడేందుకుమాత్ర‌మే ప‌ని చేస్తోందని టీడీపీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శించారు.



అక్క‌డితో ఆగ‌కుండా.. మీ పోలీసుల‌ను ప్ర‌భుత్వం, వైసీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నార‌ని, గొడ్డు చాకిరీ చేయిస్తున్నార‌ని, కొంద‌రిని ప‌దుల  సంఖ్య‌లో వీఆర్‌లో ఉంచి శిక్షిస్తున్నార‌ని వీరికి సంఘీభావం తెల‌పాల్సిన మీరు.. మౌనంగా ఉండ‌డం యూనిఫాంకే మంచిది కాదంటూ.. వ్యాఖ్యానించ‌డం చూస్తే.. పోలీసుల‌ను టార్గెట్ చేసుకుని వారిని రెచ్చ‌గొట్ట‌డం కింద‌కే వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి చీప్ పాలిటిక్స్‌ను మాను కోవ‌డ‌మే బెట‌ర్ అని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: