చైనాలో ప్రబలిన కరోనా వైరస్ (కోవిడ్ 19)  ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుంది.  కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు రెండు నుంచి ఐదు శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సింగపూర్‌లో ఉంటున్న జపాన్, మియన్మార్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నలుగురికి కోవిడ్ సోకింది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 106కు పెరిగింది.  అయితో కరోనాతో ఆస్ట్రేలియాలో కూడా ఒక మరణం సంబవించింది.

 

ఇలా ప్రతిరోజూ ఒక్కో దేశంలో కరోనా వల్ల మరణాలు సంబవిస్తున్నాయి. భారత దేశంలో ఇప్పటికే కేరళా లో ఒక కేసు నమోదు కాగా.. తెలంగాణ, ఢిల్లీలో కేసు నమోదు అయ్యాయి. టలీలో మృతుల సంఖ్య 34కు చేరుకోగా, బాధితుల సంఖ్య 1577కు చేరింది. ఇక అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. మృతులందరూ వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.  ఈ వివరాలను అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. వీరిలో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చారని... మిగిలిన వారికి అమెరికాలోనే వైరస్ సోకిందని తెలిపారు.

 

అమెరికా వ్యాప్తంగా మొత్తం 91 మందికి ఈ మహమ్మారి సోకింది. ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సులువుగా సోకుతుందని, వారు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధ్నామ్ గీభ్రీయేసూస్ హెచ్చరించారు. వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి కరోనా వైరస్ కు చికిత్స అందుబాటులోకి వస్తుందని మైక్ పెన్స్ చెప్పారు. అమెరికాలో వేసవి జూన్ లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: