భారత ప్రధాని నరేంద్ర మోదీ కి సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సెలబ్రెటీలకు సైతం లేనంత ఫాలోయింగ్ ప్రధాని మోదీ సొంతం అనే చెప్పాలి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ... వివిధ సోషల్ మీడియా యాప్స్  ద్వారా ఎప్పుడూ ఆయన అప్డేట్స్ ని  పోస్ట్ చేస్తూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్టీ కార్యక్రమాలతోపాటు... పలు సామాజిక కార్యక్రమాల గురించి కూడా యువతకు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు.అంతేకాకుండా ప్రతిపక్షాలకు సంబంధించి పలు  కూడా పెడుతూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇలా ప్రత్యక్ష రాజకీయాల్లోనే కాదు పరోక్షంగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన ట్రీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

 

 వచ్చే ఆదివారం నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ల నుంచి వైదోలుతాను  అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్  చేయడం తో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకేముంది ఈ ట్రీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన ట్వీట్ ను ఉద్దేశించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను ఎవరైనా హత్య చేశారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ పై అటు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు.

 


 అయితే ప్రధాని మోడీ పై కేసీఆర్ చేసినటువంటి కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కొద్దిసేపటికే కేటీఆర్ ట్వీట్ ను తొలగించారు. కాగా అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అనే విషయం తెలిసిందే. రాజకీయాల గురించి కాకుండా పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పలు పోస్టులు పెడుతూ ఉంటారు కేటీఆర్. ఏదేమైనా ప్రస్తుతం మోడీ పెట్టిన ట్వీట్ తో పాటు కేటీఆర్ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: