ఒక సారి అధికారంలోకి ఒక పార్టీ వచ్చింది అంటే ఆ పార్టీకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి  అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీకి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం బిజెపి పార్టీకి రికార్డు స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. మామూలుగానే అధికార పక్షానికి భారీ మొత్తంలో విరాళాలు అందుతాయని విషయం తెలిసిందే. అధికారంలో ఏపార్టీ ఉన్నా ఆ పార్టీలకు కార్పొరేట్ సెక్టార్ ల నుండి భారీ మొత్తంలో విరాళాలు అందుతూ ఉంటాయి. అదే సమయంలో అటు ప్రతిపక్షానికి కూడా సెకండ్ వాటా కింద కొన్ని విరాళాలను అందజేస్తూ ఉంటాయి కార్పొరేట్ సెక్టార్లు . ఒకటి రెండు స్థానాల్లో ఉన్న పార్టీలకు  మాత్రమే కార్పొరేట్ సెక్టార్ లు  పరిగణలోకి తీసుకుంటాయి. ఆ తర్వాత ఉండే మూడు నాలుగు ఐదు పార్టీలను మాత్రం విరాళాలు అందించేందుకు నిరాకరిస్తూ ఉంటాయి కార్పొరేట్ సెక్టార్లో. 

 


 అయితే దీనికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే.. 2018-19 ఎన్నికలకు గాను... నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీలో భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయని ఓ సంస్థ ప్రకటించింది. ఏకంగా 742 కోట్ల  రూపాయల విరాళాలు కార్పొరేట్ సెక్టర్ల  నుండి బిజెపి పార్టీకి వచ్చాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. అధికారిక లెక్కల ప్రకారం బిజెపి పార్టీకి 742 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి అని తెలిపింది. ఇవన్నీ అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ సెక్టార్ ల  చట్టబద్ధంగా ఇచ్చినటువంటి విరాళాలు. 

 

 అదే సమయంలో కేంద్రంలో ప్రతిపక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి 145 కోట్లు వచ్చాయి. ఈ విరాళాలు అన్ని అధికారికంగా ప్రకటించినవే కాకుండా ఇన్కమ్ టాక్స్ అధికారులకు కూడా తెలిసినవే. అయితే కేంద్రంలో అప్పటికే అధికారంలో ఉన్న బిజెపి 2017-18 సంవత్సరంలో నాలుగు 430 కోట్లు విరాళాలు కార్పొరేట్ సెక్టార్లో నుండి రాగా .. 2018-19 వరకు మాత్రం ఈ విరాలాలు  మరింత రెట్టింపు అయినట్టు తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే 201-18 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 24 కోట్లు మాత్రమే విరాళాలు వస్తే 2018-19 సంవత్సరంలో మాత్రం ఏకంగా 145 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇలా కార్పొరేట్ సెక్టార్లో అధికారంలోకి వస్తుంది అని నమ్మిన పార్టీలకు ఎక్కువ మొత్తంలో విరాళం పంపుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: