ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో, హైదరాబాద్ లో మరియు జైపూర్ లో ముగ్గురు కరోనా వైరస్ బారిన పడగా ఇప్పుడు తాజాగా ఆగ్రాలో మరొక ఆరుగురికి వైరస్ సోకిందని రిపోర్టులు వచ్చాయి. నిన్నే హైదరాబాద్ లో కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి దాదాపు 80 మంది తో కాంటాక్ట్ అయ్యాడని తెలియగానే వారందరినీ అతికష్టం మీద ట్రేస్ చేసి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఎప్పుడు బయటకు వచ్చిన ఆరుగురిని కూడా వైద్య పరీక్షలు చేసిన తర్వాత పర్యవేక్షణలో ఉంచారు.

 

IHG

 

ఇంకా ఆరుగురికి ఒకరితో ఒకరికి సంబంధం ఉండడం గమనార్హం. వీరందరూ ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడిన అతనికి బంధువులు .అతను వారందరినీ కలిసేందుకు ఆగ్రా వెళ్లి వారికి కూడా వైరస్ ను అంటించాడు అని చెబుతున్నారు. ముందస్తుగా ఆరుగురిని పిలిపించి రక్త పరీక్షలు చేయగా వారి ఒంట్లో వైరస్ అధిక సంఖ్యలో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇకపోతే వీరందరిని ఇప్పుడు డాక్టర్లు తమ పర్యవేక్షణలో ఉంచి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు.

 

IHG

 

అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే వీరి ఆరుగురూ ఇంకెంత మంది తో కాంటాక్ట్ అయ్యాrO అధికారులు తెలుసుకోవలసి ఉంది. దీనికోసమే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం అనే ఒక భారీ నెట్వర్క్ ద్వారా కారణం వైరస్ బారిన పడి ఉంటారని అనుమానం లో ఉన్నవారందరికీ కనిపెడుతూ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకసారి వ్యాధి సోకిన అంటే దానిని అరికట్టడం చాలా కష్టం భారత ప్రభుత్వం దీనిని ఆదిలోనే తుంచేయమని హెల్త్ మినిస్ట్రీ కి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: