నేటి కాలంలో తల్లిదండ్రులు ఏటీఎం మిషన్ వలే మారిపోయారు.. పిల్లలకు కావలసిన సౌకర్యాలను సమకూర్చడం కోసం డబ్బు వేటలో పడి.. వారిని చైల్డ్ కేర్ సెంటర్లో అప్పగించడం ఎవరి పనుల్లో వారు బిజిగా గడపడం.. అంతా బాగానే ఉంటుంది కానీ ఎదిగే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ఎంత అవసరమో గుర్తించలేక పోతున్నారు.. ఏమైనా అంటే ఇదంతా పిల్లల కోసమేగా.. మేమేమైనా చస్తే ఈ ఆస్తులన్ని మా వెంట తీసుకెళ్లుతామా అనే వేదాంత ధోరణి వల్లె వేస్తారు...

 

 

ఇకపోతే తల్లిదండ్రులు ఇద్దరు డ్యూటీ చేసేవారైతే ఆ ఇంట్లో ఎవరైనా పెద్దమనుషులుంటే ఫర్వాలేదు కానీ భార్యభర్తలు ఇద్దరే ఉండి అటు పిల్లలను, ఇటూ ఉద్యోగాన్ని బ్యాలన్స్ చేయాలంటే చాలా కష్టం.. ముఖ్యంగా మహిళలకు కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది.. కానీ విధి నిర్వహణలో ఎంత అలసి పోయినా పిల్లలతో కాస్త గడిపితే చాలు అప్పటివరకు ఉన్న నీరసం అంతా ఒక్కసారిగా మాయం అవుతుంది..

 

 

ఇక ఓ తల్లి తన ఉద్యోగంతో పాటు తన కొడుకు సంరక్షణ కూడా ముఖ‌్యమని ఆలోచించిదేమో... తన పిల్లాడిని భూజాన వేసుకుని విధులకు హాజరయ్యింది.. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం అమ్మ అనే పిలుపులోని మాధుర్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలుపుతుంది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన ప్రీతి రాణి అనే మహిళా పోలీసు కానిస్టేబుల్‌ నోయిడాలోని దాద్రి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, సోమవారం నోయిడాలో పాల్గొన్న ఓ కార్యక్రమానికి సెక్యూరిటీగా ప్రీతి రాణికి డ్యూటీ వేశారు.

 

 

ఈ క్రమంలో ఆమె ఉదయ 6 గంటలకే విధులకు హజరుకావాలి. అయితే ఆమె భర్తకు వేరే పని పడటంతో, గత్యంతరం లేక తన ఏడాదిన్నర కొడుకును వెంట తీసుకుని డ్యూటీకి హజరవగా, ఆ కార్యక్రమానికి వచ్చిన వారి దృష్టి ఆమె వైపు మళ్లింది. ఒక వైపు తల్లిగా, మరో వైపు ఉద్యోగ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న ఆమె సిన్సియారిటీకి ఫిదా అయినా నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు..

 

 

నిజమే కదండి.. ఎప్పుడు సాకు దొరుకుతుందా, చేసేపనికి డుమ్మా ఎలా కొట్టాలా అని ఆలోచించే వారున్న ఈ రోజుల్లో తనముందు ఉన్న రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న ఈ మహిళ కానిస్టేబుల్ పలువురికి ఆదర్శనీయం అని అనుకుంటున్నారు.. ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: