ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు పెనం మీద దోశలా వేడి వేడిగా ఉంటాయి అన్న సంగతి తెలిసిందే.. సీఎం జగన్ అభివృద్ధి కోసం కొత్త నిర్ణయం తీసుకోవడం.. ఆ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వార్తల్లోకి ఎక్కి వైరల్ అవ్వడం ఏపీ రాజకీయ నాయకులకు కామన్ అయిపోయింది. 

 

ఇంకా పైన చెప్పినట్టు.. కొందరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తే.. మరికొందరు ట్విట్టర్ ని వేదికగా చేసుకొని విమర్శలు చేస్తారు.. అలా విమర్శలు చేసే వారిలో ముందు వరుసలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ ది మొదటి స్థానం అయితే.. వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిది రెండో స్థానం. వీళ్ళు ఇద్దరు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్విట్స్ చేసి వైరల్ చేస్తుంటారు. 

 

ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఈరోజు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..  బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు అని మండిపడ్డారు.. అంతేకాదు.. సీఎం జగన్ స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలు చెయ్యాలని నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు అంటూ ఫైర్ అయ్యారు. దీంతో ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

విజయసాయి రెడ్డి ఇలా ట్విట్ చేశారు.. ''అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని ఓట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించాడు.'' ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: