నిన్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేసుబుక్, ట్విట్టర్ అన్ని సోషల్ మీడియా అకౌంటులని నేను వదిలేస్తున్నానని ప్రకటించాడు. దీంతో లక్షల మంది ప్రజలు తీవ్ర షాక్ కి గురయ్యారు. అలాగే ప్రజలు తమ సమయాన్ని అంతా నెట్టింట గడుపుతూ ప్లీజ్ నో సార్ సోషల్ మీడియా ని వదిలేయద్దు అంటూ గగ్గోలు పెట్టుకున్నారు. మరో వైపు అలాగే నిన్న... ' వదిలివేయాల్సింది సోషల్ మీడియా ని కాదు ద్వేషాన్ని' అంటూ రాహుల్ గాంధీ మోడీ పోస్ట్ కి స్పందించారు.

 

 

ఐతే దాదాపు 20 గంటలు గడిచిన తరువాత నరేంద్ర మోడీ మళ్ళీ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు. మహిళల దినోత్సవం రోజు, ఎవరి వ్యక్తిగత జీవితం, వృత్తి అయితే ప్రజలను ఇన్స్పైర్ చేస్తుందో ఆ మహిళలకు తన సోషల్ మీడియా ఖాతాలని ఇచ్చేస్తానని ఆ ట్వీట్ యొక్క సారాంశం. దీంతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. సోషల్ మీడియాని వదిలేస్తున్నానని అబద్దం చెప్పి యావత్ భారతదేశ ప్రజల సమయాన్ని వృధా చేశారు అంటూ చాలా మంది నెటిజన్లు మోడీపై విమర్శలు చేశారు. 

 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతూ అసలైన లీడర్ దేశం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ సంక్షోభం పై శ్రద్ధ పెట్టి ఇండియన్ ఆర్థిక వ్యవస్థని, ప్రజల సంరక్షణ ని ఎలా కాపాడాలో ప్రయత్నిస్తారు అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

 

 

రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసిన గంటలోపే నరేంద్ర మోడీ మళ్ళీ ట్విట్టర్ లోకి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు మనం కలిసి పని చేద్దాం. Covid-19 కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇండియా లో కి ప్రవేశిస్తున్న వ్యక్తులకు వైరస్ వచ్చిందో లేదో చూడడానికి అన్ని రాష్ట్రాల నేతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ పాటించవలసిన కొన్నిటిని చిత్ర రూపంలో తెలియజేశారు. 

 

మళ్ళీ ఒక గంట తరువాత రాహుల్ గాంధీ ట్విట్టర్ లోకి వచ్చి సోషల్ మీడియా అకౌంట్స్ లలో పనికిమాలిన పోస్టులు పెట్టి ఇండియా ప్రజల సమయాన్ని వృధా చేయకండి. కరోనా వైరస్ పై శ్రద్ధ పెట్టండి అంటూ సింగపూర్ పిఎం కరోనా వైరస్ గురించి మాట్లాడిన 8 నిమిషాల వీడియో ని జత చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల ట్వీట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: