ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియకపోవడంతో ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణాలు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిన్న హైదరాబాద్ లోని హస్తినాపురంలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 
 
కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ 40 లక్షల రూపాయల అప్పు తీర్చలేక ప్రదీప్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అప్పు తీర్చాలంటే ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాల్సిన పరిస్థితి ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. యువత లక్షల్లో సంపాదిస్తున్నా ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేసుకోవడంలో విఫలమవటంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 
 
జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడాలి. సమస్యలు వచ్చినా ఆ సమస్యలతో పోరాడి విజయం సాధించాలి. మరో ఘటనలో పోలియో వచ్చిన కూతురికి చికిత్స చేయించటానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో తండ్రి కూతురును చంపేశాడు. పేద, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 
 
ప్రదీప్ సమాజంలో మంచిగా, గొప్పగా బ్రతకాలని అనుకున్నాడు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టకూడదని పిల్లలు వారికి భారం కాకూడదని లేఖ రాసి ఆత్మహత్యకు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వృద్ధ్యాప్యంలో కన్న కొడుకు విగత జీవిగా పడి ఉండటంతో ప్రదీప్ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. జీవితంలో కష్టాలు, సమస్యలు శాశ్వతం కాదు. ఏ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. సమస్యలెదురైతే సమస్యలతో పోరాడి గెలిచి సాధించాలే తప్ప చనిపోవాలనే నిర్ణయం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: