ఆంధ్ర ప్రదేశ్ లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుకు మీరంటే ...మీరే కారణమని అధికార వైస్సార్ కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లు విమర్శలు గుప్పించుకుంటున్నాయి . అయితే ఈ రెండు పార్టీల ఆధిపత్య పోరులో బీసీలు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది . ఆంధ్ర ప్రదేశ్ లో 59 . 85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ సర్కార్ భావించింది . అయితే రిజర్వేషన్లు 50  శాతానికి మించడం  సరికాదని బిర్రు ప్రతాప్ రెడ్డి, బీసీ రామాంజనేయులు  అనే వ్యక్తులు  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు .

 

అయితే సదరు వ్యక్తులు  టీడీపీ సానుభూతిప రులని  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు . బీసీల మీద అక్కసుతోనే టీడీపీ నాయకత్వం , రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి మొదలుకుని ఆ పార్టీ చిన్న , చితక లీడర్ల వరకూ విరుచుకుపడుతున్నారు . అయితే కోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్న బిర్రు ప్రతాప్ రెడ్డి , బీసీ రామాంజనేయులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు కాదా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు . అయితే ఎవరికీ వారు కోర్టును ఆశ్రయించిన వ్యక్తులు తమ పార్టీ వారు కాదంటూ బీసీల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు . 

 

 ప్రస్తుతం 50 రిజర్వేషన్లతో స్థానిక సంస్థల  ఎన్నికలకు వెళితే బీసీలకు కేవలం  24 శాతం రిజర్వేషన్లు మాత్రమే  అమలు కానున్నాయి .   దాని వల్ల 30  ఏళ్లుగా బీసీ లకు అమలవుతున్న 27  శాతం  రిజర్వేషన్లను కూడా జగన్ సర్కార్ కాపాడలేకపోయిందన్న అపవాదు మాత్రం మూటగట్టుకున్నట్లయింది .  అయితే ఇరు పార్టీల వాదనలు ఎలా ఉన్నా  ...   కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే , బీసీలకు కేవలం 24 శాతం రిజర్వేషన్లు మాత్రమే లభించనుండడం తో ...  ఒక జెడ్ పీ చైర్మన్ పదవితో పాటు, 65  ఎంపీపీ, 65 జెడ్ పీ టీసీ పదవులకు రిజర్వేషన్లు కోల్పోనున్నారు . సర్పంచ్ , వార్డు సభ్యుల పదవులు కూడా పెద్ద సంఖ్యలో చేజారానున్నాయి .    

మరింత సమాచారం తెలుసుకోండి: