కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి ఎన్పిఆర్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పౌరసత్వ సవరణ చట్టం సహా ఎన్ఆర్సీ  ఎన్పిఆర్ లపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ లకు  మద్దతు ప్రకటిస్తే తాను పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధం అంటూ వైసిపి ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటనలు చేశారు. అయితే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలుకుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్పిఆర్ కు సంబంధించి ఆసక్తికర ప్రకటన చేసారు. 


 వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో  దేశ జనాభా పట్టిక కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తాము  అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.దేశ జనాభా పట్టిక లో అడిగిన పలు ప్రశ్నలకు కారణంగా... రాష్ట్రంలోని మైనార్టీలలో  అభద్రతాభావం నెలకొంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అయితే దేశ జనాభా పట్టిక గురించి... పార్టీలు విస్తృతంగా చర్చించిన తర్వాత.. 2010 లో నిర్వహించిన జనాభా పట్టిక లోని అంశాలను ప్రస్తుతం అమలు చేయ తలపెట్టిన దేశ జనాభా పట్టిక లో కూడా పొందుపర్చాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరినున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారూ. 

 


 ఒకవేళ కేంద్రం దానికి అంగీకరించని పక్షంలో దేశ జనాభా పట్టిక కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించారు. అయితే దేశ జనాభా పట్టిక గురించి కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పౌరసత్వ సవరణ చట్టం ఎన్సిఆర్ లపై  మాత్రం స్పందించలేదు. అయితే అటు వైసీపీ ఎమ్మెల్యేలు సహా పలు సంఘాలు కూడా పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి ఎన్పిఆర్ లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. లేనిపక్షంలో రాజీనామా చేస్తానంటూ ఇప్పటికే ఏపి డిప్యూటీ సీఎం అంజాద్ భాష వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ జనాభా పట్టిక కు సంబంధించి వ్యతిరేకంగా తీర్మానం చేసారని  ప్రకటించినట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: