మీడియాలో ఎడిటర్ పాత్ర చాలా కీలకం.. అది టీవీగానీ, పత్రిక కానీ.. కీలక నిర్ణయాలు వీరే తీసుకుంటారు. పత్రిక పాలసీని నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం పత్రికలు పార్టీల కర పత్రికలుగా మారిన తరుణంలో ఈ ఎడిటర్ల పాత్ర కాస్త నామమాత్రమైనప్పటికీ .. ఇప్పటికీ వీరే కీలకం. యాజమాన్యం తరువాత కీలక పాత్ర వీరిదే. అయితే ఇప్పుడు ఉన్న మీడియాలో ఓ జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఎడిటర్ పాత్రలో ఉండటం విశేషం.

 

 

ఇటీవల పలు మీడియా సంస్థల్లో ఈ ఎడిటర్లు మారారు. ఇందుకు అనేక పరిస్థితులు దారి తీశాయి. టీవీ 5 ఛానల్ ఎడిటర్ గా ఉన్న ఆకుల దినేష్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన స్థానంలో మాజీ ఈనాడు సీనియర్ జర్నలిస్ట్, చాలారోజులుగా టీవీ5లోనే చేస్తున్న విజయ్ నియమితుడయ్యాడు. విజయ్ తెర వెనుక ఉండి నడిపించడమే కాదు.. తెర ముందుక వచి డిస్కషన్లు కూడా చేస్తుంటారు.

 

 

అలాగే.. సాక్షి ఏపీ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలు తెలంగాణ సీనియర్ జర్నలిస్టు చలపతిరావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణ జర్నలిస్టును ఏపీ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్ గా పెట్టడం విశేషమే. ఇక నమస్తే తెలంగాణ నుంచి ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో తిగుళ్ల కృష్ణమూర్తిని నియమించారు. ఇటీవలే ఈనాడులోనూ ఎడిటర్ బాధ్యతల నుంచి రామోజీరావు గారు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈనాడు తెలంగాణ ఎడిటర్ బాధ్యతలను డీఎన్ ప్రసాద్ కు అప్పగించారు.

 

 

ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే... టీవీ 5 ఎడిటర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే.. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే.. సాక్షి ఏపీ రెసిడెంట్ ఎడిటర్ చలపతిరావు, ఈనాడు ఎడిటర్ డీఎన్ ప్రసాద్ లకూ ఉమ్మడి వరంగల్ జిల్లాతో అనుబంధం ఉంది. ఏపీ 24 ఇంటూ 7 టీవీ ఛానల్ హెడ్ పర్వతనేని వెంకట కృష్ణకూ ఉమ్మడి వరంగల్ తో అనుబంధం ఉంది. ఇలా వరంగల్ జిల్లాకు చెందిన వారంతా ఇప్పుడు మీడియాలో ప్రముఖ స్థానాల్లో చేరిపోయారు. అదీ విశేష।ం.

మరింత సమాచారం తెలుసుకోండి: