వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆ ఇబ్బందికర పరిస్థితులు రాజకీయ ప్రత్యర్థుల నుంచి కాదు. సొంత పార్టీ నేతల నుంచి జగన్ కు ఈ సమస్య ఎదురవుతోంది. జగన్ ను ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఆ అంశం ఏంటంటే త్వరలో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు. ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు దక్కించుకునేందుకు పార్టీలో సీనియర్ నాయకులు, జగన్ కు అత్యంత సన్నిహితులు, వీర విధేయులు ఇలా ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి పదవులు ఇస్తే మరెవరు అసంతృప్తికి గురి అవుతారో తెలియక జగన్ సతమతమవుతున్నాడు. 

 

IHG

ఒక్కసారి రాజ్యసభకు ఎంపిక అయితే ఆరేళ్ల పాటు పదవీ కాలం ఉంటుంది. దీంతో వైసిపి సీనియర్ నాయకులు బాగా ఈ పదవులపై ఆశలు పెంచుకున్నారు. ఈ నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు త్వరలో మంత్రి పదవులు కోల్పోయే ప్రమాదం ఉన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణకు జగన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరో రెండు రాజ్యసభ స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. జగన్ కు వ్యాపార భాగస్వామి గా అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డికి స్థానం కల్పిస్తారని  ప్రచారం జరుగుతోంది. 


అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విజయసాయిరెడ్డి స్నేహితుడైన బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరే కాకుండా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే సీట్లు జగన్ సూచన మేరకు వదులుకున్న మర్రి రాజశేఖర్, శ్రీకాకుళం మాజీ ఎంపీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కర్నూల్ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఇలా అనేక మంది రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతూ జగన్ పై ఒత్తిడి పెంచుతున్నారు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: