చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు దేశాలన్నీ ప్రబలుతుంది.  అమెరికాలో ఇప్పటికే ఆరుగు దాటిపోయారు. ఆస్ట్రేలియాలో ఒకరు.. ఇలా ఒక్కో దేశంలో మరణాలు సంభవిస్తున్నాయి.  తాజాగా కరోనా ఎఫెక్ట్ భారత్ లో కూడా పడింది.  ఇప్పటికే రెండు కేసులు నమోదు అయినట్లు కేంద్రం తెలిపింది.  ఇది క్షణాల్లో ప్రబలిపోయే వైరస్.. అందుకే జాగ్రత్తలు మాత్రమే పాటించాలి.. దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు.  దాంతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.  కరోనా ఎఫెక్ట్ తో   మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం, అధికారులు అప్రమత్తం కావడంతో మాస్కులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

 

వైరస్ సోకకుండా వుండడానికి మాస్కులు ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్కులకు ఎగబడుతున్నారు. కరోనా వైరస్ ఇప్పుడు తూర్పుగోదావరి వాసులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతర దేశాల్లో పని చేస్తున్న వర్కర్ల ఈ కరోనా ఎఫెక్ట్ పడుతుందని భయపడుతున్నారు. కరోనా వైరస్ కు సంబంధించి తెలంగాణ కేబినేట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది. 3000 ఐసోలేషన్ వార్డులు సిద్దం.  కరోనా పై అధ్యయనం కోసం కేరళకు వెళ్లనున్న తెలంగాణ వైద్య బృందం.

 

ప్రతి శాఖకు నోడల్ అధికారి నియామకం.  నిత్యం సమీక్షలతో ప్రజలను అలర్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇక రైళ్లలో ప్రజలు తాకే అవకాశం ఉన్న ప్రతి చోటా ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాబట్టి మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం  ఉందని సూచిస్తున్నారు.  మరోవైపు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటిస్తే కొంత మేరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవొచ్చు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: