ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్  ఎంతలా అతలాకుతలం చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం.  ఈ వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచం మొత్తం ప్రయత్నాలు చేస్తున్నది.  ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి 3000  మందికి పైగా మరణించారు.  80వేల మందికి పైగాబాధించబడుతున్నారు.  ఈ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.  అయితే, కరొనకు టీకా కనుక్కోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.  


అటు ముస్లిం దేశాలైన గల్ఫ్ దేశాల్లో ఈ వైరస్ వలన ఇబ్బందులు వస్తున్నాయి.  ముస్లింలు  ఇండోనేషియా, మలేషియావంటి దేశాల్లో  వ్యాపించింది.  చైనాకు అత్యంత మిత్రదేశంగా ఉన్న పాక్ విషయంలో మాత్రం ఏం జరుగుతుందో తెలియడం లేదు.  ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాపించింది.  కానీ, పాక్ దేశంలో ఈ వైరస్ ఉన్నదా లేదా, ఉంటె ఎలాంటి  జాగ్రత్తలు తీసుకుంటున్నారు  లేదంటే వైరస్ వచ్చిన వ్యక్తులను ఏం చేస్తున్నారు అన్నది మాత్రం బయటకు రావడం లేదు.  


ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఉత్తర కొరియా వంటి దేశం నుంచి కూడా కరొనాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.  కానీ, పాక్ నుంచి మాత్రం ఎలాంటి వార్తలు రాయడం లేదు.  ఎందుకు బయటకు రావడంలేదో తెలియదు.  ఎందుకు అక్కడ అంతటి సైలెంట్ గా ఉంటున్నదో అర్ధంకాని ప్రశ్న.  అందరికి ఒక దారైతే పాక్ కు మరో దారి అన్నట్టుగా ఉంటోంది.  మొదటి నుంచి కూడా ఈ దేశం ఇంతే.  దేని గురించి పట్టించుకొదు.  


ఇండియాను ఇబ్బందులు పెట్టాలి.  ఇండియాలో అలజడులు సృష్టించాలి.  ఇండియాతో తగాదా పెట్టుకొని ఉగ్రవాదులను ఇండియాలోకి పంపించి  ఇక్కడ ఏదో  చేయాలి.  అలా చేస్తేనే ఆ దేశానికి హాయిగా ఉంటుంది.  అక్కడి ప్రజలతో సంబందం లేదు.  వాళ్ళు ఏమౌతున్నా పట్టించుకోదు.  అందుకే ఆ దేశం ఇప్పటికీ ఆర్ధికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నది.  అక్కడ తెలివైన వ్యక్తులు ఉన్నారు.  కానీ, ఆ దేశం వారిని వినియోగించుకోవడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: