ప్రస్తుతం ప్రపంచాన్ని అదరగొడుతూ.. బెదరకొడుతున్నది ఏది అంటే.. అది కరోనా వైరస్ అని కళ్ళు మూసుకొని చెప్పచ్చు.. చైనాలో వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.. అలాంటి ఈ దారుణమైన కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అందరిని హడలెత్తిస్తోంది అంటే నమ్మండి. 

 

అలాంటి ఈ వైరస్ కారణంగా ఎంతోమంది మరణించించారు. వేలమంది ఈ వైరస్ భారిన పడ్డారు.. తగ్గిపోతుంది అనుకున్న సమయంలో ఇంకా విజృంభించి ఈ కరోనా వైరస్ అలజడి సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఇబ్బందులు పడకూడదు అని ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల ఉద్యోగులకు యాజమాన్యం ఓ చక్కటి శుభవార్త చెప్పింది. 

 

అది ఏంటి అంటే? కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ప్రచంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో తమ ఉద్యోగులు అంత కూడా ఇంటి నుండి పని చెయ్యాలని గూగుల్, ట్విటర్ సహా పలు టెక్ సంస్థలు ప్రకటించాయి.

 

ముందు జాగ్రత్తతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీలు ప్రకటించాయి.. గూగుల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులను ఇంటివద్ద నుండే పని చెయ్యాలని గూగుల్ ఆదేశాలు జారీ చేసింది. అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగికి ఫ్లూ లక్షణాలు ఉండటం వల్ల ఆ వైరస్ భారిన మరెవరు పడకూడదు అని ముందస్తు నిర్ణయం తీసుకుంది.

 

హైదరాబద్ లో కూడా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండే పని చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు అంత కూడా ఇంటి నుండే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ వైరస్ భారత్ లో మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: