ఇటలీ అంటే ఇప్పుడు ఇండియా భయపడిపోతున్నది.  ఎందుకో అనుకునేరు.  ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తుల వలన కరోనా ఇండియాలో స్పీడ్ గా వ్యాపిస్తోంది.  ఢిల్లీలో నమోదైన మొదటి కేసు ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తిద్వారానే వచ్చింది.  అలా వచ్చిన ఆ వ్యక్తి ఢిల్లీలో శుక్రవారం రోజున బర్త్ డే పార్టీ ఇవ్వడం ఆ పార్టీకి అనేక మంది స్కూల్ పిల్లలు హాజరు కావడం వంటివి జరిగిపోయాయి. దీంతో ఢిల్లీలో ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్ ను మూసేశారు.  


దీంతో పాటుగా ఢిల్లీలో అనేక చోట్ల కూడా కరోనా సోకిన వ్యక్తి ప్రయాణం చేశారు.  ఫిబ్రవరి 28 వ తేదీన ఓ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ పిజ్జా తిన్నారు.  ఆ సమయంలో ఆ హోటల్ లో పనిచేసే 14 మంది సిబ్బందిని హాస్పిటల్ కు తరలించి ఆబ్సెర్వేషన్ లో ఉంచారు.  అలానే కరోనా సోకినా వ్యక్తి అగ్ర వెళ్లి అక్కడ తన కుటుంబ సభ్యులను కలిసిన సంగతి తెలిసిందే. అక్కడ వారిలో కూడా కరోనా లక్షణాలు కనిపించినట్టు తెలుస్తోంది.  


కరోనా వైరస్ ప్రభావం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఢిల్లీలో మొదటి కేసు నమోదైన తరువాత ఇండియా అప్రమత్తం అయ్యింది.  విదేశాల నుంచి వచ్చే వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.  ఇదిలా ఉంటె, ఇటీవలే ఇటలీ నుంచి ఇండియాకు వచ్చిన ఓ పర్యాటకుడికి కరోనా ఉన్నట్టుగా తేలడంతో అతడిని అదుపులోకి తీసుకొని చికిత్స అందిస్తున్నారు.  అతనితో పాటుగా ఇండియా వచ్చిన మరో 21 మందిని కూడా ఆబ్సెర్వేషన్ లో ఉంచారు.  


అంతేకాదు, ఆగ్రాలో కరోనా వ్యక్తి కుటుంబ సభ్యులలో కూడా కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేలింది.  దీంతో వారి నమూనాలకు పూణే లోని వైరాలజి ల్యాబ్ కు పంపించారు.  ఈరోజు రేపట్లో అక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తాయి.  వైరస్ వైరస్ ప్రభావం వలన ఇప్పుడు ఇండియా అనేక ఇబ్బందులు పడుతున్నది.  ఇప్పటికే ఇటలీలో 2000 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  అనేకమంది మరణించిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: