ప్రతిపక్షంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత అబ్బా, కొడుకులకు జనాలు చుక్కులు చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం జనాభిప్రాయంతో సంబంధం లేకుండా నెట్టుకొచ్చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా తాము అధికారంలోనే ఉన్నామంటూ ఓవర్ యాక్షన్ చేస్తుండేసరికి జనాలు ఇద్దరికీ చుక్కలు చూపిస్తున్నారు. మొన్ననే విశాఖపట్నంలో చంద్రబాబునాయుడును  జనాలు అడ్డుకోవటం ఎంత సంచలనంగా మారిందో అందరూ చూసిందే. అలాంటిది రెండు రోజులు తిరక్కుండానే తాజాగా లోకేష్ ను తూర్పు గోదావరి జిల్లాలో జనాలు అడ్డుకోవటం కలకలం రేపుతోంది.

 

తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్ మంగళవారం పర్యటించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా లోకేష్ సీతానగరం అనే ప్రాంతంలో యాత్రను ప్రారంభించగానే స్ధానిక రైతులు అడ్డుకున్నారు. టిడిపి హయాంలో  పురుషోత్తమపట్నం ప్రాజెక్టు కోసం బలవంతంగా తమ భూములు లాక్కున్న ప్రభుత్వం కనీసం పరిహారం కూడా ఇవ్వలేదంటూ మండిపోయారు. అమరావతి రైతుల గురించి ఇపుడు మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేష్ అప్పట్లో తమ భూములను బలవంతంగా ఎలా లాక్కున్నారంటూ నిలదీశారు. బలవంతంగా తమ భూములను లాక్కున్న ప్రభుత్వం పరిహారమైనా ఎందుకు ఇవ్వలేకపోయిందంటూ మండిపోయారు.

 

ఇదే విషయమై లోకేష్ తో రైతులు, స్ధానికులు వాగ్వాదానికి దిగారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. లోకేష్ తమ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలంటూ నినాదాలిస్తు యాత్ర వైపుకు దూసుకొచ్చారు. దాంతో టిడిపి నేతలు లోకేష్ కు రక్షణగా నిలిచి రైతుల వైపుకు దూసుకెళ్ళారు. దాంతో రెండు వైపుల జనాలు రెచ్చిపోవటంతో పెద్ద ఎత్తున తోపులాట మొదలైంది. రైతులపై టిడిపి నేతలు దాడులు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పింది.

 

ఇంతలో కొందరు రైతులు  సభ జరుగుతున్న వేదిక మీదున్న కుర్చీలను తీసి విసిరేశారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని అతికష్టం మీద లోకేష్ ను అక్కడి నుండి తరలించారు. మొత్తం మీద విశాఖపట్నంలో చంద్రబాబుకు ఏమైందో తూర్పుగోదావరిలో లోకేష్ కూడా దాదాపు ఇదే జరిగింది. అంటే ఇద్దరిపైనా జనాగ్రహం సేమ్ టు సేమ్ అన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: