ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు పలు దేశాలు పడిపోతున్నాయి. కరోనా దెబ్బతో ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం అత‌లాకుత‌లం అయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ స‌ర్వ‌నాశ‌నం చేసింది. ఎంతో మంది ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇక మరికొందరు గత రెండు నెలల నుంచి ఇంటి గడప దాటి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. మరికొందరు ఆహారం లేక అల్లాడిపోతున్నారు. ఇక చైనాపై ఆధార‌ప‌డిన ఆసియా దేశాల‌న్ని దిగుమ‌తులు ఆగిపోయి అత‌లాకుత‌ల మ‌వుతున్నాయి.



ఇక ఇప్పుడు థాయ్‌లాండ్‌, మ‌లేషియా, ద‌క్షిణ కొరియా. ఉత్త‌ర కొరియా, బ‌ర్మా లాంటి దేశాలు సైతం క‌రోనా దెబ్బ‌కు విల‌విల్లాడుతున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆసియా దేశమైన ఇరాన్ ను కరోనా గడగడలాడించింది. విచిత్రమేంటంటే ఇప్పటివరకు ఇరాన్ లో కరోనా వైరస్ సోకి 77 మంది మృతి చెందారు. మరో 3 వేల మంది క‌రోనా బాధితులు ఉన్నారు. పార్లమెంట్ లో ఉన్న 290 మంది ఎంపీల లో ఏకంగా 23 మంది ఎంపీలు కరోనా వైరస్ భారిన పడ్డారంటే కరోనా ప్రజాప్రతినిధులు సైతం వ‌ద‌ల‌డం లేదని అర్థమవుతుంది.



వైద్య పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రజాప్రతినిధులు సైతం కరోనా వైరస్ భారిన పడడంతో ఆ దేశంలో క‌రోనా ఎలా పాకుతుందో అర్థం అవుతోంది. ఇక ఇరాన్ ఉపాధ్యక్షురాలు సైతం కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇక క‌రోనా దెబ్బ‌తో ఇరాన్‌లో ప‌లు రంగాల్లో ఉత్ప‌త్తులు క్షీణించాయి. చైనాలాగానే ఇరాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ రేటు సైతం రోజు రోజుకు క్షీణిస్తోంది. అక్క‌డ ప్ర‌ధాన ఎగుమ‌తి అయిన చ‌మురు రంగంలో ప‌నిచేసే కార్మికులు క‌రోనా దెబ్బ‌తో ప‌నిలోకి రావ‌డానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఇరాన్ వైద్య ఆరోగ్య శాతం అప్ర‌మ‌త్త‌మైంది. ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా ప‌రిస్థితిపై సమీక్ష‌లు చేస్తున్నారు. క‌రోనా సోకిన వారికి ప్రాణాపాయం లేకుండా వైద్యం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: