చైనాలోని  వుహాన్‌ నగరంలో మొదలైన కరోనా వైరస్ (కొవిడ్ -19) చిన్న చిన్నగా ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిపోతుంది.  ఇప్పటికే చైనాల 3 వేల మందికి పైగా మృత్యు వాత పడ్డారు.  80 వేళ మందికి పైగా ఈ రోగాన భారిన పడ్డట్టు సమాచారం.  ప్రస్తుతం చైనాలో ఈ వ్యాధితో మరణాలు కాస్త తగ్గు ముఖం పట్టిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ (కొవిడ్ -19)  ఇప్పుడు ఇతర దేశాలపై విజృంభిస్తుంది.  భారత్ లో కరోనా వైరస్ మెల్లగా విజృంభిస్తోంది. తాజాగా మరికొందరికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

 

అలాగే మరో 15 మంది టూరిస్టులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారికీ కూడా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ లక్షణాలతో ఓ వ్యక్తి అడ్మిట్‌ కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి వారం రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ (కొవిడ్ -19) కేసు బయటపడడంతో పాఠశాల విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో ఈ వైరస్ పై అవగాహన కోసం అధికారులు సమాయత్తం అవుతున్నారు. 

 

వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను బుధవారం నుంచి ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఈ విషయాలు పాటించేలా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.  ఈ సందర్భంగా విద్యార్థులు వాడుతున్న మరుగు దొడ్లు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి.. మధ్యాహ్న భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇతరులో ఎలా ప్రవర్తించాలి.. ఒకవేళ ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఎలా కనుగొనాలి.. వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలన్న విషయంపై అవగాహన కల్పిస్తారని సమాచారం. 61 పాఠశాలలను ఎంపిక చేసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: