కరోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రధాన సమస్య. దాదాపు 60 దేశాల్లో కరోనా బాదితులు ఉన్నారు. లక్ష మందికి పైగా ఈ వైరస్‌ భారిన పడినట్టుగా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా ఈ లెక్క కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడు వేల మంది ఈ వ్యాదితో మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ లెక్క కూడా మరింత భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. అసలు కరోనా విషయంలో బయటకు వస్తున్నవన్నీ నిజాలేనా.. లేక ప్రభుత్వాలు ఈ విషయంలో ఏదైన గోప్యత పాటిస్తున్నారా..?

 

ఈ విషయంపై మీడియా సర్కిల్స్‌ లో అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం చైనా లో చాలా విషయాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఆంక్షలు మీడియా పై కూడా ఉన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఓ కథానాన్ని ప్రచురించింది. ఫాంగ్‌ బిన్‌ అనే సామాజిక కార్యకర్త ప్రస్తుతం చైనా లోని వూహాన్‌ నగరంలోని పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రజల్లోని భయాందోళనలు ప్రపంచానికి యూట్యూడ్‌ వీడియోల ద్వారా పరిచయం చేశారు.

 

ఆ వీడియో లను లక్షాలాది మంది వీక్షించారు. దీంతో ప్రభుత్వం ఆ చానల్‌ మీద చర్యలు తీసుకుంది. ఫాంగ్‌ బిన్‌ జనవరి 25న తొలిసారిగా వూహాన్‌ పరిస్థితిని వీడియో రూపంలో విడుదల చేశారు. అయితే దాన్ని చైనా ప్రభుత్వం నిషేదించింది. ఫిబ్రవరి 1న ఆయన ఓ వ్యాను లో శవాలను ఎక్కిస్తున్న వీడియోను చిత్రీకరించాడు. ఆ రోజు ఆయన్ను పోలీసులు ప్రశ్నించారని ఫాంగ్ ఆరోపించాడు. చివరగా ఫిబ్రవరి 9న ప్రజల ఆందోళనకు సంబందించిన వీడియోను పోస్ట్ చేసి ఫాంగ్‌ తరువాత ఏ వీడియోనే పోస్ట్ చేయలేదు. దీంతో ఆయనకు ఏమైంది అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: