ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలయ్యింది. పోలింగ్ తేదీ ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. అభ్యర్థులను ఎంపిక చేయడం, పార్టీ తరఫున ప్రచారం ఇలా అన్ని విషయాల్లోనూ చురుగ్గా కనిపిస్తున్నారు. అయితే ఆ హడావుడి కానీ, ఆ సందడి కానీ జనసేన పార్టీలో ఇప్పుడు కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాల నివారణ పేరుతో ఈసారి ప్రభుత్వం అతి తక్కువ సమయం మాత్రమే కేటాయించింది. ఇందులో విజయం సాధించాలంటే ప్రతి నిమిషమూ కీలకమే. అయితే జనసేన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉంటుందా లేదా అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది. 

IHG


గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు పరిమితమై పోయింది. 141 స్థానాల్లో పోటీ చేసిన జనసేన కొన్ని చోట్ల మాత్రమే డిపాజిట్లు దక్కించుకుంది. ఇక గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వైసిపి కు మద్దతు గా ఉండడంతో జనసేన ఇప్పటికీ అయోమయంలో ఉంది. ఈ నెలాఖరు లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ  నేపథ్యంలో నోటిఫికేషన్, పోలింగ్ ఫలితాలు ఇలా అన్నింటికీ కేవలం పది పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే క్షేత్ర స్థాయిలో బలం ఉన్న పార్టీలు మాత్రమే విజయం సాధిస్తాయి. కానీ ఆ బలం పెద్దగా లేని జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అని అనుమానం అందరిలోనూ కలుగుతోంది. 

IHG


ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో జనసేన పరిస్థితి తారుమారయ్యింది. ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే ఏపీలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకోవడం ఎందుకని బిజెపి భావిస్తోంది. జనసేన పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు జనసేన నుంచి ఏ స్పందన ఇప్పటి వరకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: