ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు తెలంగాణ‌ను కూడా భ‌య పెడుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనాకు బ్రేక్ వేసేందుకు స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది. క‌రోనా బాధితులు అంద‌రూ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే క‌రోనా అనుమానితుల‌ను గాంధీ ఆసుప‌త్రితో పాటు హైద‌రాబాద్ ఫీవ‌ర్ ఆసుప‌త్రికి తీసుకు వ‌స్తున్నారు. గాంధీలో ఐసోలేష‌య‌న్ వార్డులు కూడా ఏర్పాటు చేసి మ‌రీ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఒక్క హైద‌రాబాద్ మాత్ర‌మే కాకుండా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి కూడా ర‌క‌ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతోన్న వారు అంద‌రూ ఇక్క‌డికే వ‌స్తుండ‌డంతో ఇక్క‌డ క‌రోనా టెన్ష‌న్ తీవ్రంగా ఉంది.



క‌రోనా వైర‌స్ ఎక్కువైతే ఇది ఆ హాస్ప‌టల్లో మిగిలిన వారికి కూడా సోకుతుంద‌న్న ఆందోళ‌న ఉంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా క‌రోనా ఆసుప‌త్రి ఏర్పాటు చేయాల‌ని ఆగ‌మేఘాల మీద నిర్ణ‌యించింది. గాంధీ ఆసుప‌త్రి న‌గ‌రం న‌డిబొడ్డున ఉండడంతో క‌రోనా వైర‌స్ త్వ‌ర‌గా వ్యాప్తిచెందుతుంద‌న్న భ‌యం కూడా ఉంది. అందుకే సిటీకి దూరంగా క‌రోనా ఆసుప‌త్రి ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది.
అనంత‌గిరితో పాటు మ‌రో రెండు ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తోన్న ప్ర‌భుత్వం.. ఈ రెండు చోట్ల ఎక్క‌డో ఓ చోట ఈ ఆసుప‌త్రి ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌ని టాక్‌..?



అలాగే ఇప్ప‌టికిప్పుడు సికింద్రాబాద్ మిల‌ట‌రీ ఆసుప‌త్రిని సైతం క‌రోనా ఆసుప‌త్రిగా మార్చే ఆలోచ‌న‌ను  కూడా ప్ర‌భుత్వం చేస్తోంది. క‌రోనా ఏపీ కంటే తెలంగాణ‌లో విజృంభిస్తోంది. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ఇది ఇప్ప‌టికే ఎంట్రీ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా అంద‌రిలోనూ భ‌యాందోళ‌న‌ల‌ను నెల‌కొన్నాయి. వీటిని అరిక‌ట్టి.. క‌రోనాకు పూర్తిగా చెక్ పెట్టాల‌ని భావిస్తోన్న సీఎం కేసీఆర్ క‌రోనాకుఏ ప్ర‌త్యేకంగా హాస్ప‌ట‌ల్ ఉండ‌డ‌మే క‌రెక్ట్ అని స్పీడ్‌గా నిర్ణ‌యం తీసుకున్నారు. కేటీఆర్‌తో పాటు తెలంగాణ యంత్రాంగం సైతం దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఎలెర్ట్‌గా ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: