ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారతదేశంలో కూడా రావడం జరిగింది. ఢిల్లీ మరియు హైదరాబాద్ నగరాలలో కరోనా పాజిటివ్ కేసులు బయట పడటం జరిగింది. దీంతో పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ బయటపడటంతో జగన్ కి అతి పెద్ద తలనొప్పిగా స్థానిక సంస్థల ఎన్నికలు మారాయి. విషయంలోకి వెళితే ఇటీవల హైకోర్టు మార్చి నెలాఖరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది. ఇదే తరుణంలో మరోపక్క రాజ్యసభ ఎన్నికలు కూడా రావడంతో ఒకపక్క ఎన్నికల టెన్షన్ మరోపక్క కరోనా వైరస్ ఎప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో అడుగు పెడుతుందేమో అని జగన్ తెగ టెన్షన్ పడుతున్నారట.

 

అంతేకాకుండా ఇప్పటికే కరోనా వైరస్ వదంతులు తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాలలో భయంకరంగా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయడానికి జగన్ సర్కార్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్న ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడీ అవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ పరిస్థితి ఏంటి అన్నది తేలిపోతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

 

మరోపక్క తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న క్రమంలో ఈ సమయంలోనే మరోసారి 2019 అసెంబ్లీ ఎన్నికల టైపు విజయం సాధిస్తే...టీడీపీ లేకుండా పోతుందని భావిస్తున్నారట. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం. మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ ఎన్నికలలో ఏదోవిధంగా కొద్దో గొప్పో గెలిచే లాగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అంటూ స్టార్ట్ చేయటంతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నేతలు కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: