ప్ర‌పంచాన్ని ఒణికిస్తున్న‌క‌రోనా వైర‌స్ గురించిన వ‌దంతులు భారీ ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. క‌రోనా ల‌క్ష ణాలు క‌నిపిస్తే.. ఇక‌, మ‌ర‌ణానికి చేరువైన‌ట్టే అనే ప్ర‌చారం జోరుగాసాగుతోంది. అయితే, ఇలాంటి ప్ర‌చారం కేవ‌లం ప్ర‌చార‌మే. క‌రోనా పెద్ద ముప్పేమీ కాదు. అలాగ‌ని దానిని అంటించుకోవ‌డ‌మూ స‌రికాదు. వైర‌స్ సోక కుండా ముందుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే ఇప్పుడు మ‌న‌ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. ఈ క్ర‌మంలో అస‌లు క‌రోనా గురించి , దాని ప్ర‌భావం గురించి కొంత తెలుసుకుందాం..

 

+ ప్ర‌పంచ వ్యాప్తంగా 82 వేల మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. వీరిలో 77 వేల మంది చైనావాసులే కావ‌డం గ‌మ‌నార్హం.
+ అంటే.. మీలో ఎవ‌రైనా చైనావెళ్ల‌క పోయినా.. చైనా నుంచి వ‌చ్చిన వారితో ఎలాంటి సంబంధాలు నెర‌ప‌క‌పోయినా.. ఈ వైర‌స్ మీకు ఇబ్బంది క‌లిగించే ఛాన్స్ లేన‌ట్టే
+ ఒక‌వేళ క‌రోనా సోకినా.. పెను ప్ర‌మాదం ఏమీ ముంచుకురాదు..
81 శాతం క‌రోనా కేసులు మైల్డ్‌
14 శాతం కేసులు మోడ‌రేట్‌
కేవ‌లం 5% మాత్ర‌మే ప్ర‌మాద‌క‌రం

 

+ అంటే దీనిని బ‌ట్టి వైర‌స్ సోకినంత మాత్రాన ప్రాణాల‌కు ప్ర‌మాదం లేక‌పోగా.. దీనినుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా అవ‌కాశం ఉంది.
+ కొంత‌మంది సార్స్ క‌న్నా క‌రోనా ప్ర‌మాద‌మ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ, ఇది నిజం కాదు. సార్స్ ఫాట‌లిటీ రేట్ 10 శాతం అయితే, క‌రోనా 2శాతం మాత్ర‌మే.
+ ఇక‌, క‌రోనా వ‌ల్లే రోజు ఇన్ని మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని భావించ‌డం, ప్ర‌చారం చేయ‌డం కూడా క‌రెక్ట్ కాదు. ఎందుకంటే.. అనేక రూపాల్లో నిత్యం అనేక మంది చ‌నిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఫిబ్ర‌వ‌రి 28కి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఒక్క‌రోజే చైనాలో 108 మంది క‌రోనా మృతులు ఉన్నారు.

 

అయితే, వాస్త‌వానికి క‌రోనా కంటే కూడా అదే రోజు వివిధ కార‌ణాల‌తో వేల మంది మృతి చెందారు.
కేన్స‌ర్ కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 28న 26,283 మంది
గుండెపోటు కార‌ణంగా 24,641 మంది
డ‌యాబెటీస్ వ‌ల్ల 4300 మంది  మృతి చెందారు.
ఇక‌, ఆత్మ‌హ‌త్య‌ల కార‌ణంగా వైర‌స్ భారిన ప‌డి మృతి చెందిన వారిక‌న్నా 28 రెట్లు ప్రాణాలు కోల్పోయారు.  దీనిని బ‌ట్టి క‌రోనాతో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏమీలేదు. కేవ‌లం కొన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: