ఈ మధ్యకాలంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహిళలు కామపు కోరల్లో చిక్కుకోక  తప్పడం లేదు. మహిళలపై లైంగిక వేధింపులకు అత్యాచారాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేసిన ఎక్కడ భయం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ప్రతి చోట మహిళలపై లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. 

 

 

 ఇక్కడ ఓ యువతికి ఇలాంటి ఘటనే జరిగింది. కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కింది యువతీ. కాగా  ఆటోడ్రైవర్ కామం తో ఊగిపోయి నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపాడు.  ఆటో డ్రైవర్ లైంగికంగా దాడి చేయడం చూసి షాక్ కి గురైన ఆ యువతి... ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి పోలీసులకు పంపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది . దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు యువతి తో అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబై మలాడ్ లోని  కాలేజీకి వెళ్లేందుకు ఓ విద్యార్థిని ఆటో ఎక్కింది. 

 

 

 అయితే కామంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్ ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశం చూసి ఆటో నిలిపివేశాడు. ఇక ఆటోలో ఉన్న యువతి పై అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో ఆటో డ్రైవర్ తన జననాంగాన్ని బయటకు తీసి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు. ఇక యువతిని ఆటో అద్దం నుంచి చూస్తూ హస్త ప్రయోగం చేయడం మొదలు  పెట్టాడు. అంతేకాకుండా ఆ యువతి అసభ్యంగా తాగడం వంటివి చేశాడు. ఇక ఆటోడ్రైవర్ తీరును చూసి అవాక్కయిన ఆ యువతి వెంటనే సెల్ఫోన్ తీసి ఆటోడ్రైవర్ చేస్తున్న పాడు పని మొత్తం చిత్రీకరించింది. అనంతరం యువతి ఈ వీడియోని  సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. తద్వారా  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ వీడియో సాయంతో నిందితుని గుర్తించి పోలీసులు ఆటో డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి కటకటాల వెనుకకు తోసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: