చంద్రబాబు పేరు చెప్పినా .. ఆయనకు ఆర్ధిక అండదండలు అందించే వారి సంస్థలన్నా ఏపీలో జగన్ అభిప్రాయం ఎలా ఉందొ తెలియదు కానీ ఆ కేంద్ర అధికార పార్టీ బీజేపీ మాత్రం  ఒంటికాలి మీద లేస్తోంది. తెలుగుదేశం పార్టీనే కాకూండా ఆ పార్టీకి ఆర్ధిక అండదండలు అందిస్తున్నా వారి విషయంలోనూ బీజేపీ ఆగ్రహంగానే ఉంది. గతంలో చంద్రబాబుతో బీజేపీ దోస్తీ చేసినా ఆ తరువాత తెగ తెంపులు చేసుకోవడంతో పాటు బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ తో చేతులు కలపడంతో పాటు ఆర్ధికంగా నిధులు సర్దుబాటు చేసిన సంగతి కూడా బీజేపీ ఆధారాలతో సహా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి చంద్రబాబే ధ్యేయంగా పావులు కదుపుతూ ఆర్ధిక మూలలను పెకిలించి పడేయాలని ఆ బీజేపీ పెద్దలు చూస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు చేస్తున్న చేయిస్తున్న ఈ వ్యవహారాలను ఎత్తి చూపిస్తూ ధైర్యంగా విమర్శించలేక షరా మామూలుగానే వైసీపీ మీద టీడీపీ విమర్శలు చేస్తోంది. 

 

IHG


తాజాగా తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తూ వస్తుంది అన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల మీద ఇప్పుడు ఐటీ శాఖ దృష్టిపెట్టింది. అంతే కాదు మొత్తం ఆర్ధిక వ్యవహారాలన్నిటిని కూపీ లాగుతోంది. కార్పొరేట్ విద్య సంస్థలుగా పేరు పొందిన కొన్ని కొన్ని టీడీపీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తూ తమ విద్య వ్యాపారాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరాటంకంగా కొనసాగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఆర్ధిక మూలాలపై ద్రుష్టి పెట్టిన కేంద్రం చైతన్య విద్యసంస్థలపై ఐటీ దాడులు చేయిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. 

 

IHG

 

ఒక్క చైతన్య విద్య సంస్థల్లోనే కాదు ముందు ముందు నారాయణ విద్యాసంస్థలపైనా ఐటీ దాడులు జరిగే అవకాశం లేకపోలేదు. నారాయణ, శ్రీ చైతన్య విద్య సంస్థలపై ఇప్పడే కాదు ఎప్పటి నుంచో ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడపడం, విద్యార్థులకు సౌకర్యాలు అంతంత మాత్రంగా కల్పించడంతో పాటు లక్షలాది రూపాయల ఫీజులు ముక్కు పిండి వసూల్ చేయడం ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇవే కాదు టీడీపీకి ఆర్ధికంగా సపోర్ట్ ఇచ్చిన.. ఇస్తున్న వాళ్ళందరి లిస్ట్ సిద్ధంగా ఉంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది బండారం బయటకు లాగుతున్నారు... ఇంకా మరికొందరివి లాగే పనిలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: