ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అడుగు తీసి అడుగు వేయ‌డంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసు కోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ఆ అడుగులు త‌ప్ప‌ట‌డుగులు అయ్యే ప్ర‌మాదం కూ డా పొంచి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. పార్టీలో అదినేత వేస్తున్న అడుగులు మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ వివాదాల దిశ‌గా సాగుతుండ‌డంపై తాజాగా చ‌ర్చ జ‌రుగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. పార్టీలో ఆధిప‌త్య రాజ‌కీయాలు పెరిగా యని, దిగువ శ్రేణి నాయ‌కుల మాట‌ల‌కు, వారి ప‌నుల‌కు కూడా విలువ లేకుండా పోయింద‌ని, అందుకే పార్టీ ఓడిపోయింద‌ని పార్టీ సుప్రీం చంద్ర‌బాబుకు నివేదిక అందిన త‌ర్వాత‌.. దిగువ శ్రేణి నాయ‌కుల‌కు విలువ ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.


అయితే, ఈ ప్ర‌క‌ట‌న కేవ‌లం ప్ర‌క‌ట‌న‌గానే మారిపోయింది త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో మాత్రం లేదు. దీంతో ద్వితీయ శ్రేణి నేత‌లు తీవ్ర ఆవేద‌న‌లో మునిగిపోయారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు వీరుఎవ‌రిపైనైతే ఆరోప‌ణ‌లు చేస్తున్నా రో.. వారినే చంద్ర‌బాబు మ‌ళ్లీ మ‌ళ్లీ పెద్ద‌వాళ్ల‌ను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ‌కీయ వార‌సుల‌కే ఆయ న ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వారికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నియోజ‌క వర్గాల పై ప‌ట్టు  పెంచుకున్న‌ప్ప‌టికీ.. ద్వితీయ శ్రేణి నాయ‌కులు కేవ‌లం జై కొట్టేందుకు మాత్ర‌మే ప‌రిమిత‌మయ్యారు.


దీంతో పార్టీలో ఒక విధ‌మైన స‌హాయ నిరాక‌ర‌ణ ఎదురై.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఏకంగా పార్టీ ఓట‌మికే ఇది దారితీసింది. దీంతో ఈ పాఠాలు తాను నేర్చుకున్నాన‌ని, త‌ను మారేందుకు సిద్దంగా ఉన్నాన‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పారు. అంతేకాదు, కొన్ని రోజుల కింద‌ట యువ నేత‌ల‌తో భేటీ అయి... వార‌సులు, వార‌సులు కాని వారికి కూడా పార్టీలో గుర్తింపు ఉంటుంద‌ని, ఎవ‌రూ నిరుస్తాహ ప‌డొద్ద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, 33 శాతం ప‌ద‌వులు యువ‌త‌కే ద‌క్కుతాయ‌న్నారు.


కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎలాంటి ప‌ద‌వుల‌ను యువ‌త‌కు ఇచ్చింది లేదు పైగా ఇప్పుడు టీడీపీలో యువ‌త‌కు విందు ఏర్పాటు చేసినా.. వార‌సుల పిల్ల‌ల‌కే ఆహ్వా నాలు అందాయి. వారికే దిశానిర్దేశం సాగింది. దీంతో దీంతో ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయ‌కులు విల‌విల్లాడుతున్నారు. ఇన్నాళ్లు తాము అనేక క‌ష్టాల‌కు ఓర్చి .. పార్టీ కోసం కృషి చేశామ‌ని, కానీ ఇప్పుడు ఇలా వ్య‌వ‌హ‌రించి మాకు ద‌క్కాల్సిన ప‌ద‌వులు వారికి కేటాయిస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: