తెలుగుదేశంపార్టీ సత్తాను చాటు కోవటానికి దాదాపుగా ఇవే చివరి ఎన్నికలనే చెప్పాలి. ఈ మార్చి నెలలలో జరగబోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలే పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేసేస్తాయనటంలో సందేహం లేదు. ఈ నెలలోనే సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసితో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయిపోయాడు. మొన్నటి ఎన్నికల్లో 151 సీట్ల బంపర్ మెజారిటి గెలిచిన జగన్ మంచి ఊపుమీదున్నాడు. మరి 23 సీట్లతో చావు తొప్పి కన్ను లొట్టపోయిన చంద్రబాబునాయడు పరిస్ధితేంటి ?

 

నిజంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితిలో టిడిపి లేదనే చెప్పాలి. అందుకనే ఎంత వీలుంటే అంతగా ఎన్నికలను వాయిదా వేయించేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఒకటనుకుంటే జగన్ మరొకటిగా తలచి స్ధానిక ఎన్నికలను వెంటనే పెట్టేస్తున్నాడు. సిఎం నిర్ణయంతో టిడిపి నేతల గుండెల్లో రాళ్ళు పడినట్లే అనుకోవాలి.

 

మొన్నటి ఘోర పరాజయం తర్వాత టిడిపి నేతలు కోలుకోలేదు. ఇంతలోనే మళ్ళీ ఎన్నికలంటే కష్టమనే అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు మ్యానిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేసేస్తున్నాడు. సరే హామీల అమలులో  అక్కడకక్కడ కొన్ని సమస్యలున్నమాట వాస్తవమే. కానీ జనాలేమో హామీల అమలులో జగన్ చిత్తశుద్దినే చూస్తున్నారు.

 

హామీలిచ్చి అన్నీ వర్గాలను హోల్ సేల్ గా మోసం చేసిన చంద్రబాబు నైజంతో జగన్ చిత్తశుద్దిని పోల్చి చూసుకుంటున్నారు. దాంతో రేపటి ఎన్నికలు వైసిపికి మరింతగా అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. నిజంగా అదే జరిగితే స్ధానిక సంస్ధల ఎన్నికలను కూడా వైసిపి స్వీప్ చేయటం ఖాయమనే అనుకోవాలి. అంటే మిగిలిన నాలుగేళ్ళలో రాష్ట్రంలో ఇక ఎన్నికలన్నవే ఉండవు. కాబట్టి టిడిపి పుంజుకుందా లేదా అన్నది కూడా తేలే  అవకాశాలు లేవు. అందుకనే  టిడిపి భవిష్యత్తును మార్చి నెల తేల్చేయబోతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: