2019లో చంద్రబాబు అధికారం దిగిపోతూ...జగన్‌ నెత్తిమీద చాలానే బరువు పెట్టి వెళ్లారు. ఇష్టారాజ్యంగా ఎన్నికల ముందు పథకాల పేరుతో డబ్బులు పంచేసి, ఎడాపెడా అప్పులు చేసేసి, ఆ అప్పుల భారాన్ని జగన్‌పై పెట్టేశారు. ఆ ప్రభావం ఇప్పటికీ జగన్ ప్రభుత్వం మీద కొనసాగుతుంది. అలాగే చంద్రబాబు దిగిపోయే ముందు చేసిన ఇంకో తప్పు వల్ల, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ తిట్లు తిన్నారు. 

 

అలా బాబు తప్పు వల్ల జగన్ బలైన విషయం ఏమిటంటే? సాధారణంగా జూన్, జూలై మాసాల్లో రైతులు,  పొలాలు దుక్కులు దున్నుకుని, తొలకరి మొదలు కాగానే పంటలు వేయడానికి సిద్ధమవుతారు. అయితే పంటలు వేయాలంటే విత్తనాలు కావాలి. అందుకు ప్రభుత్వం జూన్, జూలై మాసాల కంటే ముందే రైతులకు సరిపడా విత్తనాలని సేకరించి, రైతులకు అందజేస్తుంది. అయితే జగన్ ప్రమాణ స్వీకారం చేసింది మే 30న. అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం విత్తనాలు సేకరించే కార్యక్రమం చేయలేదు. క

 

ఆ కార్యక్రమం చేయాల్సింది...ముందున్న చంద్రబాబు ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఎన్నికల్లో ఓటర్లని ఎలా ఆకట్టుకోవాలా, వాళ్ళకు ఏ రూపంలో డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేశారు తప్ప, రైతుల పరిస్తితి గురించి ఆలోచించలేదు. దీంతో జగన్ అధికారంలోకి రాగానే విత్తనాల కొరత మొదలైంది. అప్పటికప్పుడు విత్తనాల సేకరణ చేసిన, రైతులు ఇబ్బందులు తొలగలేదు. ముఖ్యంగా వేరుశనగ రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల రైట్లు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. ఈ విత్తనాల కొరత ప్రభుత్వందే కాబట్టి, అప్పుడు రైతులు జగన్‌పైనే విమర్శలు చేశారు. వారికి అసలు విషయం తెలియదు కాబట్టి, జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అయితే అప్పుడు ఏదో బాబు తప్ప వల్ల జగన్ మాటలు పడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ప్లాన్ చేసింది. తొలకరి ఏరువాక దృష్ట్యా రైతులకు విత్తనాలు సేకరించి, అందుబాటులో ఉంచేందుకు ఏపీ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కార్పొరేషన్ విత్తనాలు ముందుగానే సేకరించి పెట్టేసుకుని, తొలకరి రాగానే రైతులకు అందిస్తుంది. దీంతో ఈసారి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడరు.

మరింత సమాచారం తెలుసుకోండి: