అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్సే రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా రిపీటవుతుందా ? అన్న విషయంలో పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీలకు గాను వైసిపి 151 సీట్లను అంటే సుమారు  85 శాతం సీట్లను గెలుచుకున్న విషయం అందరూ చూసిందే. మరి అదే దామాషాలో ఫలితాలు రిపీటవుతుందా ? నిజానికి అప్పటికన్నా రేపటి ఎన్నికల్లో మరింత సానుకూల ఫలితాలు రావాలి వైసిపికి.

 

ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్మోహన్ రెడ్డికి జనాలు బ్రహ్మరథరం పట్టినపుడు తొమ్మిది నెలల పరిపాలన తర్వాత ప్రతిపక్షాలకు అసలు ఒక్క సీటు కూడా రాకూడదు ఎక్కడా. తొమ్మిది నెలల పాలనలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా సుమారు 4 కోట్లమంది జనాలను టచ్ చేసినట్లు పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఫించన్లు, రేషన్, విద్యాదీవెన, అమ్మఒడి, ఆటో డ్రైవర్లు, రైతుబంధు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయటం ద్వారా జగన్ అన్నీ సామాజికవర్గాలను టచ్ చేశారు.

 

మరి జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని వైసిపి వాళ్ళు చెప్పుకుంటున్నదే నిజమైతే ప్రతిపక్షాలు ఎక్కడ కూడా గెలవకూడదు. జగన్ కు అంతా బ్రహ్మాండమేనా ? వ్యతిరేకత ఎక్కడా లేదా ? అంటే చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షాలు, పచ్చమీడియా వంద ఉదాహరణలు చెబుతున్నాయి. జనాలందరూ జగన్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ను దింపి వెంటనే చంద్రబాబును గద్దెమీద కూర్చోబెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ పచ్చమీడియా ఊదరగొట్టని రోజు లేదు.

 

అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఇసుక సమస్య వచ్చింది. అలాగే అర్హులకు కూడా పెన్షన్ల ఇవ్వటం లేదంటున్నారు. రేషన్ కార్డులు కూడా ఏరేశారని గోల జరుగుతోంది. ఇళ్ళ పట్టాల పంపిణీలో అర్హులకు అన్యాయం జరిగిందంటున్నారు. ఇక రాజధాని ప్రాంతంలో అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన అందరూ చూస్తున్నదే. మరి సానుకూలంగా ఎన్ని పాయింట్లున్నాయో దాదాపు అన్ని వ్యతిరేక పాయింట్లను చంద్రబాబు, ప్రతిపక్షాలు, పచ్చమీడియా గొంతెత్తి గోల చేస్తున్నాయి. కాబట్టి ఈ నేపధ్యంలో జరగబోతున్న ఎన్నికల్లో గనుక మ్యాజిక్ రిపీట్ కాకపోతే .....

మరింత సమాచారం తెలుసుకోండి: