సైబరాబాద్ లోని ఐటీ కారిడార్ లోని  సాఫ్ట్ వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తోన్న ఒక మహిళా టెక్కీ కి కరోనా వైరస్ సోకడం తో  ,  ఐటీ కారిడార్ నుంచి  కంపెనీలన్నీ తమ కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయంటూ విన్పిస్తోన్న  వదంతుల్లో ఎటువంటి నిజం లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ , ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ లు వెల్లడించారు . ఐటీ కారిడార్ లోని   ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తోన్న  మహిళా టెక్కీ   ఇటీవల  ఇటలీ కి వెళ్లి వచ్చింది.

 

దాంతో ఆమెకు కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన సాఫ్ట్ వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి .  ముందు జాగ్రత్త చర్యగా తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించి వేశాయి . ఇంటి నుంచి పని చేయాలని (వర్క్ ఫ్రమ్ హోమ్ ) ఆదేశించాయి . ఈ పరిణామం తో  ఐటీ కారిడార్  నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను ఎత్తివేస్తున్నాయన్న వదంతులు వ్యాప్తి చెందడం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది .  మహిళా టెక్కీ కి కరోనా లక్షణాలు ఉన్న మాట నిజమేనని , అయితే ఇంకా నిర్ధారణ కాలేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు . అయితే  సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఈ సమయం లో తమ ఉద్యోగులను విదేశాలకు పంపవద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు .

 

దుబాయి కి వెళ్లి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించడం తో అతన్ని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే . ఇక ఇటలీ కి వెళ్లి వచ్చిన మహిళా టెక్కీ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలడం తో కంపెనీ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: