మోదీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2000 రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం 2000 నోటును అందుబాటులోకి తెచ్చినా 2000 రూపాయల నోట్లు రద్దు కాబోతున్నాయని మార్కెట్లోకి కొత్త 1000 రూపాయల నోట్లు రాబోతున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా కేంద్రం , అధికారులు ప్రకటన చేయనప్పటికీ కొందరు ప్రజలు మాత్రం ఈ వార్తలను ఇప్పటికీ నమ్ముతున్నారు. 
 
సోషల్ మీడియాలో మళ్లీ మార్కెట్లోకి కొత్త 1000 రూపాయల నోట్లు వచ్చాయని కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పచ్చరంగులో ఉన్న ఆ నోట్లను చూసి కొందరు నిజంగానే మార్కెట్లోకి కొత్త 1000 రూపాయల నోట్లు వచ్చాయేమోనని విశ్వశిస్తున్నారు... కొందరైతే ఏకంగా కొత్త 1000 రూపాయల నోట్లు కావాలని బ్యాంకులకు వెళుతున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఆర్బీఐ ఇప్పటివరకూ 1000 రూపాయల నోట్లను ముద్రించలేదు. 
 
ఇప్పటివరకూ ఆర్బీఐ దగ్గర 1000 రూపాయల నోట్లను ముద్రించాలన్న ప్రతిపాదన కూడా లేదు. ఆర్బీఐ ఈ నోట్ల గురించి ఆలోచించటం లేదని కొందరు ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొత్త వెయ్యి రూపాయల నోట్లు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వదంతులు కేవలం 1000 రూపాయల నోట్లకు మాత్రమే పరిమితం కాలేదు. 
 
సోషల్ మీడియాలో 5000 రూపాయల నోటు కూడా వైరల్ అవుతోంది. వీటితో పాటు 10 రూపాయల నుండి 2,000 రూపాయల నోటు వరకూ కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్బీఐ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నమ్మి మోసపోవద్దని సూచించింది. కొత్త నోట్ల కోసం తాము ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ స్పష్టత ఇచ్చిన తరువాతైనా సోషల్ మీడియాలో ప్రచారం ఆగుతుందో లేదో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: