రాజ్యం వీరభోజ్యం అన్నారు. రాజు అన్నవాడు ఎపుడైనా యుధ్ధం చేసి సత్తా చూపి గెలుచుకోవాలి. అలా తొమ్మిది నెలల క్రితం బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇపుడు మరో యుధ్ధానికి సిధ్ధమైపోతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఈ నెలలో పెట్టేస్తున్నారు. దాంతో విజయ విహారం చేయాలనుకుంటున్నారు. 

 

మరో వైపు చూసుకుంటే ఏపీలో  ప్రతిపక్షమంతా డీలాపడి ఉంది. అసలు వారు ఎన్నికల గురించి ఆలోచన చేయకపోవడం విశేషం. ప్రధాన పక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అంటే వణుకుతోంది. బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీం కోర్టుకు వెళ్ళమని ఆ పార్టీ అంటోంది. అంటే ఓ విధంగా ఎన్నికలు ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు వాయిదా పడాలన్నది సైకిల్ పార్టీ ఆలోచనగా ఉంది.

 

నిజానికి  చంద్రబాబు నాయకత్వంలో అవతల వారి బలహీనతల మీద  గెలవడం తప్ప సొంతంగా తమ బలం మీద గెలిచిన దాఖలాలు లేవు. దాంతో టీడీపీ ఎన్నికలంటే భయం అన్న భావన ఏర్పడిపోయింది.  బాబుకు  జగన్ అతి పెద్ద పోటీగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి దాదాపుగా పదినెలలు అవుతోంది. జగన్ కి జనాదరణ తగ్గింది. మళ్ళీ గెలవాలి. ఎన్నికలు పెట్టాలి, కుర్చీ దిగాలి అని  గట్టిగా సవాళ్ళు చేసిన  బాబు తీరా లోకల్ బాడీ ఎన్నికలు అనేసరికి మాత్రం ఎక్కడలేని వంకలూ వెతుకుతున్నారని టాక్ నడుస్తోంది.

 


చంద్రబాబు చెబుతున్నట్లుగా జగన్ పట్ల జనంలో ఇపుడైతే వ్యతిరేకత లేదులా ఉంది. అందుకే ఎన్నికలు వద్దు అనలేక వాయిదాల కోసం ఎత్తులు వేస్తున్నారని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరో వైపు చూసుకుంటే జనసేన నాయకులు కూడా లోకల్ బాడీ ఎన్నికలకు రెడీగా లేరని వారి మాటలను బట్టే తెలుస్తోంది. సుప్రీం కోర్టుకు వెళ్తామని జనసేన నేతలు అనడం, party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ ఇతర పార్టీలు సైతం అదే డిమాండ్ చేయడంతో ఎన్నికల ఫలితాలు  ఏకపక్షంగా వైసీపీకే దఖలు పడతాయని అంటున్నారు.

 

ఇదే విషయాన్ని టీడీపీ పెద్దాయన జేసీ దివాకర్రెడ్డి కూడా అంటున్నారు. మేము ఎన్నికల్లో పోటీ చేయం, ఎందుకంటే వాటిని ఏకపక్షం చేసుకోవడానికే జగన్ కొత్త చట్టం తెచ్చారని వంక పెడుతున్నారు. దాని అర్ధం చేతులెత్తేయడమేనని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

 

జగన్ పాలనంతా సంక్షేమ పధకాలతో ప్రతీ ఇంట్లో పైసలు పెద్ద ఎత్తున  గుమ్మ‌రించేశారు. పైగా అధికారం చేతిలో ఉంది. మొత్తం ఎన్నికల వ్యవధి కూడా పదిహేనురోజులేనట. దాంతో బాబు అండ్ టీం లొ వణుకు పుడుతోందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: