ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనాలో అయితే పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతుంది. చైనాలో మరణ మృదంగం వాయిస్తున్న కరోనా వైరస్ బారినపడి ఇప్పటికే మూడు వేల మందికి పైగా చనిపోగా 80 వేల మంది ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో  పోరాడుతున్నారు. ఇక ప్రస్తుతం భారత దేశాన్ని కూడా కలవరపెడుతుంది ఈ ప్రాణాంతకమైన వైరస్. దీంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలీ  అంటేనే భయపడిపోతున్నారు భారతీయులు.ఇక మాస్కులు బ్లౌజుల కోసం మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఏ వస్తువుల ద్వారా ఏం చేయడం వల్ల కరోనా వ్యాపిస్తుంది అనే విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు

 


 ఇక ప్రస్తుతం చైనా దేశంలో అయితే పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోయిన విషయం తెలిసిందే, అయితే ఇప్పటికే కరెన్సీ నోట్ల మార్పిడి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అటు ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లు ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు అక్కడి జనాలు. ఇక జియాంగిన్  నగరానికి చంద్ర అంట్ లీ అనే మహిళ తాజాగా ఆమె బ్యాంకు నుంచి కరెన్సీ నోట్లని విత్ డ్రా చేసింది.అయితే ఆ నోట్లకు  కరోనా  వైరస్ ఉంది అని అనుమానించింది. అయితే మైక్రో ఓవెన్ లో పెట్టి వేడి చేస్తే కరోనా  వైరస్ పోతుందని ఆ మహిళ భావించింది. దీంతో 31 వేలు  మైక్రోవేవ్ ఒవేన్ లో పెట్టి వేడి చేసింది. ఇక కాసేపటికి మైక్రోవేవ్ తెరిచి చూస్తే డబ్బులు అన్నీ కాలి బూడిద అయిపోయాయి. 


 అయితే ఆమె మైక్రోవేవ్ ఒవేన్ లో పెట్టిన చాలా నోట్లు కాలిపోగా కొన్ని మాత్రమే ఆమె చేతికి దక్కాయి. ఇక మిగిలిన డబ్బులు పట్టుకొని బ్యాంక్ లోకి వెళ్ళింది. బ్యాంకులో మార్పు  చేద్దామని వెళ్తే బ్యాంకు అధికారులు మాత్రం ఆ నోట్లను తీసుకోలేదు. అగ్ని ప్రమాదం జరిగినట్టు ఆధారాలు చూపిస్తేనే ఆ నోట్లను మార్పిడి చేసుకోవాలని అధికారులు తెలిపారు. చివరికి ఓ బ్యాంకులో అధికారులు ఆమె దగ్గర ఉన్న నోట్లు తీసుకొని కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు అంగీకరించారు. ఏదేమైనా కరోనా  వైరస్ ఎఫెక్ట్ తో  ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: