ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ నేత‌, ఇరిగేషన్ శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుప‌డ్డారు. 70 ఏళ్లు వ‌చ్చినా చంద్ర‌బాబు నాయుడు త‌న బుద్ధి మార్చుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే వాళ్ల‌ను నాయ‌కులు అంటారే కానీ...ప్ర‌జ‌ల‌ను వాడుకునే వాళ్ల‌ను కాద‌నే విష‌యాన్ని బాబు గ్ర‌హించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీసీల‌ పార్టీ అంటూ 35 ఏళ్లు బీసీలను మోసం చేశారే తప్ప బీసీలకు చంద్ర‌బాబు ఏమీ చేయలేదని మండిప‌డ్డారు.

 

``జ‌గన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అన్ని పదవులలో 50 శాతం బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా అనేక రంగాలలో క్యాబినెట్ లో కూడా ఎన్నడూ లేని విధంగా ఆ వ‌ర్గాల‌కు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ రిజ‌ర్వేష‌న్ 60 శాతం ఉండేది అది జగన్ వల్ల తగ్గిపోయిందని ఈ రోజు  చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ విష‌యంలో వాస్త‌వాలు ప్ర‌జ‌లు తెలుసుకోవాలి. చంద్రబాబూ...2018లో స్థానిక సంస్థ‌ల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరపకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించావో దానికి సంబంధించి కొందరు కోర్టుకు వెళ్తే అఫిడవిట్ మీరు వేయ‌లేదా? 2018 సెప్టెంబర్లో పంచాయితీ తరపునుంచి నీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ మీ బండారం బ‌య‌ట‌పెడుతుంది`` అని తెలిపారు.

 

బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అఫిడ‌విట్ ప్రధానమైన పాయింట్స్ ఇవి అని ఈమేర‌కు అనిల్ వివ‌రించారు. ``తెలంగాణా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అది కామన్ హైకోర్టు కాబట్టి అది ఏపికి  కూడా వర్తిస్తుందనే వాదన వినిపించావు. రెండో వాదన 2011-12లో హైకోర్టు 50 శాతం అని ఇచ్చాక.2013లో సుప్రీంకోర్టుకు వెళ్తే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.దానికి సంబంధించి తిరిగి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పింది. 2013 వరకే రిజర్వేషన్లు ఇచ్చారు.కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిని తీర్పు ప్రకారం ఏ ఎన్నికలకు 50 శాతం కంటే ఎక్కువ వెళ్లలేం కాబట్టి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల,సుప్రీంకోర్టు నిర్ణయం వల్లన డిటైల్డ్ బ్యాక్ వర్డ్ క్యాస్టులకు కమీషన్ వేస్తాం అని ఆరోజు ఎన్నికలకు వెళ్లలేదు. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా అఫడవిట్ వేశావు.50 శాతం దాటకూడదని అందులో చెప్పావు. ఈ ప్రభుత్వం వచ్చాక 59.85 శాతం రిజర్వేషన్లు చేసి హైకోర్టుకు వెళ్తే మాకు అభ్యంతరంలేదు మీరు వెళ్లచ్చు అని చెప్పింది. ఎక్కడ ఎన్నికలు వచ్చేస్తాయో అని భయపడి గుంట నక్కలాగా ప్రతాపరెడ్డి అనే వ్యక్తి చేత పిల్ వేయించారు. రెడ్డి అనే వ్యక్తితో వేయిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందుతుందని ప్రజలు భావిస్తారని చంద్రబాబు అనుకున్నాడు. బీసీలలో రెచ్చగట్టే కార్యక్రమం చేయించవచ్చని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో వేయించారు.`` అని అస‌లు విష‌యం వెల్ల‌డించారు. 

 

ఎన్నిక‌ల విష‌యంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అనిల్ తెలిపారు. ``ఈరోజు ఎన్నికలు జరగకపోతే రాష్ర్టంలో ఉన్న ఆర్దికపరిస్దితులలో 4 వేల కోట్లు వెనకకు వెళ్లే పరిస్దితులు ఉన్నాయి. ఏదో ఒకరకంగా ఎన్నికలు ఆపాలి. కుట్ర చేయాలి. ఎన్నికలు ఆపేసి 4 వేల కోట్లు రానీయకుండా వైయస్ జగన్‌పై బురద చల్లాలి.ఇదే చంద్ర‌బాబు పని. 70 ఏళ్ల వ‌య‌సులో కూడా కుట్ర‌లు ఆప‌వా?`` అని ప్ర‌శ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: