ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2019 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు అయిన నేపథ్యంలో ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు జగన్. అసలు రాష్ట్రంలో పరిపాలనపై స్పందన ఎలా ఉందో ఈ ఎన్నికలలో తేలిపోతుందని తన సహచరులతో జగన్ అన్నట్లు వార్తలు రావడం జరిగాయి. చాలా వరకు మొత్తం రాష్ట్రమంతటా పాజిటివ్ వాతావరణం ఉండటంతో, అదే తరుణంలో జాతీయ స్థాయిలో కూడా పరిపాలన పై మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ ఖుషీ మీద ఉన్న వైయస్ జగన్ ఎన్నికలలో ఏపీ ప్రజలు యొక్క అభిప్రాయం మొత్తం తేలిపోతుందన్న ఆలోచనలో ఉన్నారట.

 

ఇటువంటి తరుణంలో బీసీ రాజకీయాల గురించి ఒక్కసారిగా ఏపీ రాజకీయం మొత్తం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ అంశం లో అధికారం మరియు విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో బీసీ నేత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు కి లెఫ్ట్ అండ్ రైట్ రీతిలో ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు దాదాపు 35 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమ స్వార్థం కోసం బీసీలను వాడుకున్న దుర్మార్గపు నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. కులాల, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు నైజాం అని అన్నారు.

 

చంద్రబాబు కుళ్ళు, కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు కి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేసారు. బిర్రు ప్రతాప రెడ్డి అనే వ్యక్తి తో హైకోర్టు లో రిజర్వేషన్ల ఫై చంద్రబాబు పిటిషన్ వేయించారని అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు గుంట నక్కలా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం బీసీలపై కల్లబొల్లి ప్రేమ చూపిస్తున్నారు అని, చంద్రబాబు ని ఎవరూ నమ్మవద్దని అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: