రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. రాష్ట్రం నుండి ఏకంగా 4 ఎన్నిక అవుతున్న క్రమంలో చాలా మంది పేర్లు వినబడగా, ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి పేరు వస్తుంది. వైయస్ జగన్...మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లు మొన్నటిదాకా ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో చిరంజీవికి రాజ్యసభ సీటు పై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎప్పుడైతే సినిమా రంగంలోకి రీ-ఎంట్రీ ఇవ్వడం జరిగిందో అప్పటినుండే పూర్తిగా రాజకీయాలను చిరంజీవి పక్కన పెట్టేయడం జరిగిందని నాగబాబు అన్నారు.

 

అంతేకాకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తన కంటే ఎక్కువగా సమాజంపై అవగాహన ఉండటం తో పాటుగా మంచి ప్రజా సేవ చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు కావడంతో పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అవుతున్నారని త్వరలోనే మరొక సినిమా ప్రకటించే అవకాశం ఉందని నాగబాబు తెలిపారు. అయితే మూడు రాజధానుల కు మద్దతు తెలిపిన చిరు, ఒక పౌరుడిగా మాత్రమే తెలిపినట్లు నాగబాబు వివరించారు.

 

జనసేన పార్టీ తరపున పవన్ ,నేను అమరావతి ప్రాంత రైతులకు పూర్తీ మద్దతు ఇస్తున్నట్లు, ఇచ్చినట్లు మరొకసారి ప్రస్తావించారు. అమరావతి జేఏసీ చిరు ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చిన విషయం అందరికి తెల్సిందే. రాజకీయ జీవితానికి చిరు పూర్తిగా దూరంగా ఉన్నారని, కానీ అన్ని పార్టీల వారితో చిరు కు సత్సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. అంతేకాకుండా కావాలని కొన్ని పార్టీలకు చెందిన వెబ్ సైట్లు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నారు అంటూ అబద్ధపు రాతలు రాస్తున్నారని వాటిలో వాస్తవం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: