కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నాయకులు అందరికి వరుస వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో నాయకుడు ఏదో వ్యవహారంలో చిక్కుకుని వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు. ఎప్పుడు ఏ నాయకుడు ఏ వ్యవహారంలో వివాదాస్పదం అవుతాడో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కు ఏపీ సీఎం జగన్  ఇచ్చిన షాక్ ఇప్పుడు బలంగా తగిలింది. జగన్ వ్యూహాత్మకంగా అశోక్ గజపతిరాజు హవాకు అడ్డుకట్ట వేశారు. ఇంతకీ విషయం ఏంటి అంటే.. పూసపాటి రాజ కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ ధర్మ కర్తగా ఉన్న అశోక్ గజపతి రాజును అకస్మాత్తుగా ప్రభుత్వం తొలగించింది. దీనికోసం రాత్రికి రాత్రి రహస్య జీవో కూడా జారీ అయ్యింది.  

IHG


పూసపాటి ఆనంద గజపతి రాజు తొలి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె, ఢిల్లీలో బీజేపీ నేతగా ఉన్న సంచిత  గజపతిని మాన్సా స్ ట్రస్ట్ చైర్మన్ గా నియమించడం, క్షణాల్లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిపోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా అశోక్ గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్ గా తొలగిస్తూ సంచితనుచైర్మన్ గా నియమిస్తున్నట్లు ఒక గంట ముందు వరకు కూడా మాన్సాస్ ట్రస్ట్ సిబ్బందికి కూడా తెలియకుండా చాకచక్యంగా జీవో విడుదల అయ్యింది. దీనిని రహస్యంగా ఉంచారు. సంచిత గజపతి ప్రమాణస్వీకారానికి ముందుగానే వైసిపి కీలక నాయకులు కొందరు ఆమెతో సమావేశం అయ్యారు. అయితే దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 

IHG cbn


ఆమెతో పాటు కోటను పరిశీలిస్తున్నట్లుగా కాన్వాయ్ లో వైసీపీ నేతలూ వెళ్లడం, ట్రస్ట్ కార్యాలయంలోకి వెళ్ళిన వెంటనే అకస్మాత్తుగా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. మాన్సాస్ ట్రస్ట్ కు దేశంలో అనేక ప్రాంతాల్లో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సుమారు 13 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచిత అసలు వారసురాలు కాదని అదితి వాదిస్తున్నారు. జగన్ రాజకీయ కక్షతోనే ఈ విధంగా జీవో తెచ్చినట్లుగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: