ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన క్రేజీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టీసీపీట్ చేసి మొదటి నుంచి చివరి వరకు తన టాలెంట్ తో ఎంతో జాగ్రత్తగా ఆడటంతో పాటు, ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొన్న రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకు ఆ సీజన్లో విజేతగా నిలిచాడు. స్వతహాగా సింగర్ అయిన రాహుల్ పలు సినిమాల్లో పాటలు కూడా పాడటం జరిగింది. ఇకపోతే నేడు ఆయనపై ఒక ఘోరమైన దాడి జరిగింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో గల ఒక ప్రముఖ పబ్ కు నిన్న రాత్రి 11 గంటల సమయం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితురాలితో కలిసి వెళ్లడం జరిగింది. అయితే అదే సమయంలో పబ్ లోని కొంతమంది యువకులు అతడి స్నేహితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో, వెంటనే రాహుల్ వారిని వారించే ప్రయత్నం చేశాడు. కాగా కాసేపటికి వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఆపైన అది పెద్ద గొడవ గా మరి కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళటం జరిగింది. అదే సమయంలో ఆ యువకుల్లోని కొందరు పబ్ లో ని బీర్ బాటిల్స్ ను తీసుకుని రాహుల్ తలపై  బలంగా మోదటం జరిగింది.

 

దానితో తలపై తీవ్ర రక్తస్రావం కావడంతో రాహుల్ ను తక్షణమే గచ్చిబౌలి ప్రాంతంలో గల ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇక  ఘటన విషయం వెనువెంటనే తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఆ గొడవకు కారణమైన వ్యక్తుల్లో ఒకరు వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సోదరుడని సమాచారం. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాహుల్ పరిస్థితి పై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: