అబ్బబ్బా.. సోషల్ మీడియాలో ప్రచారం ఎంత దారుణంగా జరుగుతుంది అంటే.. చెప్పకూడదు.. హైదరాబాద్ లో ఒక వ్యక్తి కరోనా వైరస్ సోకింది అంటే మరో వ్యక్తికి సోకింది అని.. ఆ లక్షణాలు ఉన్నాయి అని.. మీరు మాస్కులు ధరించకపోతే వచ్చేస్తుంది.. బయట ఆహారం తీసుకోకపోవడం మంచిది అని వార్తలు వస్తున్నాయి. 

 

ఇంకొందరు అయితే మరి దారుణంగా ఈ కరోనా వైరస్ పై ప్రచారం చేస్తున్నారు.. ఈ ప్రచారాల కారణంగా ప్రజల్లో భయం భారీ స్థాయిలో పెరిగిపోయింది. కరోనా వైరస్ కారణంగా టెక్ కంపెనీలు చాలా శాతం ఉద్యోగులను ఇంటి నుండే పని చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.. అలాగే హైదేరాబద్ లో కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ మూసేశారు.. మరికొన్ని చోట్లా.. అదే మహీంద్రా హిల్స్ లాంటి ప్రాంతంలో జనసంచారం ఆగిపోయింది అంటే నమ్మండి. 

 

ఇకపోతే అలంటి దారుణమైన పరిస్థితిలో ఉంది ప్రస్తుతం హైదరాబాద్. ఇకపోతే ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటిదాకా చోటుచేసుకున్న మరణాలు... ఇప్పటికే మనకు పీడగా మారిన వైరస్ మరణాలనూ పోల్చే శాస్త్రీయ విశ్లేషణ ఒక చార్ట్. అందులో ఏముంది అంటే ? సీజనల్ ఫ్లూ, మీజిల్స్, ఎబోలా, హెచ్ఐవీ, చికెన్ గున్యా వంటి వైరసులతో సంభవించే మరణాలతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ. 

 

అయితే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల ఈ వైరస్ పై అందరూ భయపడ్డారు కానీ.. నిజానికి ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.. ఈ కరోనా వైరస్ కొన్ని ఏజ్ గ్రూపుల్లో మరణాల రేటు ఎక్కువ.. ఎందుకంటే, ఆ ఏజ్ గ్రూప్ వారికీ రోగనిరోధకశక్తి ఉడిగిన వయస్సులవి.. త్వరగా అవయవాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. 

 

అయితే పిల్లల్లో, యువకుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే కాబట్టి మరణాల రేటు చాలా చాలా తక్కువ. ఎటొచ్చీ వృద్ధులు, అదీ 55 దాటినవాళ్లకే ఈ కరోనా వైరస్ సమస్య.. 40, 45 ఏళ్ల వరకూ ఈ వైరస్ వల్ల మరణించేంత ముప్పు చాలా తక్కువ.. మరీ 70, 80 ఏళ్ళు దాటినవాళ్లకు రిస్క్ ఎక్కువ. అదీ కూడా 100 శాతం కాదు. 

 

చైనాలో 80 వేల మందికి సోకిన ఈ కరోనా వైరస్ అక్కడ మరణాలు 3 వేలు.. మరో 10 వేలమందికి సీరియస్ చికిత్స ఇస్తున్నారు.. కరోనా బారిన పడిన వేలమంది ఆ వైరస్ నుంచి బయటపడ్డారు.. వారు అందరూ ఇంటికి కూడా వెళ్లిపోయారు. కాబట్టి కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్త పడితే చాలు. కొత్త కొత్త వైరస్ లు వస్తుంటాయి. అంతమాత్రాన బయపడిపోతే ఎలా? 

మరింత సమాచారం తెలుసుకోండి: